Moviesఅత‌డితో డేటింగ్‌లో ఉన్నా… పెళ్లి మాత్రం అడ‌గొద్దు… పెద్ద షాక్ ఇచ్చిన...

అత‌డితో డేటింగ్‌లో ఉన్నా… పెళ్లి మాత్రం అడ‌గొద్దు… పెద్ద షాక్ ఇచ్చిన మాధ‌వీల‌త‌..!

విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయి మాధవిలత నచ్చావులే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు యూత్‌లో మాధవిలత‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత మాధవీలత స్నేహితుడా, అరవింద్ 2 సినిమాలలో కూడా నటించింది. అచ్చ తెలుగు అమ్మాయి.. చూడటానికి అందంతో పాటు టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో ఆమె హీరోయిన్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు.

కనీసం తెలుగు అమ్మాయిలు అంజలి, ఈషారెబ్బ లాంటి వాళ్లకు వచ్చిన క్రేజ్ కూడా మాధవీ లతకు రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన అతిధి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలుగా కూడా ఆమె కనిపించింది. హీరోయిన్ గా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన మాధవిలత గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు కూడా ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ నుంచి గుంటూరు వెస్ట్ సీటులో పోటీ చేసి ఓడిపోయింది.

ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తాను ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. నేను ఒక వ్యక్తిని కలిశాను.. ముందు అతడిని అర్థం చేసుకోవాలి… ఆ తర్వాత రెండు వైపులా తల్లిదండ్రుల నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. అయితే ఇది అంత త్వరగా జరిగే పని కాదని.. మరో ఏడాదికి పైగా సమయం పట్టొచ్చు.. తాను అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెప్తా.. పెళ్లి తేదీ గురించి మాత్రం అడగవద్దు అని తేల్చేసింది.

అత‌డు తెలుగు వ్యక్తి కూడా కాదు.. నేను ఎప్పుడూ నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో మాత్రం ఎప్పటికీ రాజీపడను అంటూ మాధవీలత పోస్ట్ చేసింది. మాధవీలత పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తాను డేటింగ్ లో ఉన్నానని చెబుతూనే.. పెళ్లి గురించి మాత్రం అడగవద్దని చెప్పడంతో.. ఆమెకు డేటింగ్ మాత్రమే ఇష్టం.. పెళ్లి ఇష్టం లేదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news