Moviesచ‌ర‌ణ్ ప్లాప్ సినిమా పోస్ట‌ర్ వేసి… ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అంటారా…...

చ‌ర‌ణ్ ప్లాప్ సినిమా పోస్ట‌ర్ వేసి… ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అంటారా… ఇంత‌క‌న్నా దారుణం ఉందా…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేసి చరణ్ అభిమానులకు అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చారు

పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైటిల్ కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు నిన్న మొన్నటి వరకు సర్కారోడు – సీఈవో అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అన్న టైటిల్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో చరణ్ స్టైలిష్ లుక్‌లో అదరగొట్టేసాడు. బైక్ పై చెదిరిన జుట్టు, గాగుల్స్ పెట్టుకుని వెనక్కి తిరిగి ఇచ్చిన ఫోజ్ అయితే బాగుంది.

అయితే ఇప్పుడు ఈ పోస్టర్ పై చరణ్ అభిమానులే సోషల్ మీడియాలో డైరెక్టర్ శంకర్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో లుక్ ని పోలి ఉందని.. ఆ సినిమాలోని చరణ్ సేమ్ టు సేమ్ ఇదే లుక్‌తో కనిపిస్తాడని మండిపడుతున్నారు. పాన్‌ ఇండియా సినిమా అంటే ఏ రేంజ్‌లో ? ఫస్ట్ లుక్ ఉండాలి. కానీ బ్రూస్‌లీ లాంటి సినిమా పోస్టర్ వేసి ఇప్పుడు కొత్త పోస్టర్ అంటారు ఏంటని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అటు బ్రూస్ లీ పోస్టర్ ఇటు గేమ్ ఛేంజ‌ర్ పోస్టర్ పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్.. అది కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా తీస్తున్నప్పుడు ఫస్ట్ లుక్ – టీజర్ – ట్రైలర్ ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అలాంటిది చరణ్ నటించిన ఒక ప్లాప్ సినిమాలో ఫోటోను తీసుకువచ్చి దానిని ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేయడం ఎంతవరకు ? కరెక్ట్ అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. బ్రూస్ లీ ఫోటో గేమ్ ఛేంజ‌ర్ ఫోటో పక్క పక్కన పెట్టి ఆడేసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news