బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో బ్యూటీలు అనగానే గుర్తుకు వచ్చేది.. అంజలి, జమున.. సావిత్రి.. వంటి అగ్ర తారా మణులు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో పొట్టి పొట్టి బట్టలు వేసుకునే అవకాశం వీరికి లేదు. ఉంటే కూడా వేసుకునే వారు కాదేమో..! అయితే.. జేమ్స్‌బాండ్ సినిమాలకు వచ్చేసరికి.. అన్నగారి కాలంలోనే.. స్విమ్మింగ్ డ్రస్‌లు వచ్చేశాయి. అయితే.. అప్పటికి వీరి హవా తగ్గడంతో.. వీరు దూరంగా ఉన్నారు.
అయినా కూడా.. భక్తిపాత్రలకు అంజలీదేవి ప్రతిరూపంగా మారారు. అంజలి నటించిన అనే క సినిమాలను పరిశీలిస్తే.. భక్తి పాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. సొంత బ్యానర్‌పై ఆదినారాయణరావు (అంజలీదేవి భర్త) తీసిన సినిమాల్లోనూ కూడా అంజలీదేవి భక్తిపాత్రలే చేశారు. ఇక, రక్తికి వచ్చేసరికి సావిత్రినే చెప్పుకోవాలి. భక్తి పాత్రలు చాలా చాలా తక్కువగా నటించారు.
సాంఘిక చిత్రాల్లో ప్రేమ, విషాదం.. వివాదం ఉన్న అంశాల్లో సావిత్రి నటన అద్భుతంగా ఉంటుంది. ఇక, జమున వదరు బోతు పాత్రల్లో జీవించారు. అయితే.. భక్తి – రక్తి కలబోసిన పాత్రలు మాత్రం అంటే.. ఇటు ప్రేమ.. అటు భక్తి.. ఒకే సమయంలో మేళవించిన పాత్రలు మాత్రం చాలా చాలా తక్కువ మంది చేశారు. వీరిలో ఫైర్ బ్రాండ్ భానుమతి కీలక కధానాయికగా మిగిలారు.
భానుమతి – నాగేశ్వరరావు నటించిన విప్రనారాయణ నుంచి అనేక చిత్రాల్లో ఆమె భక్తిరసాన్ని.. అదే సమ యంలో రక్తిని కూడా మేళవించి.. పనిచేశారు. దీంతో భానుమతి పేరు ఒక దశలో మార్మోగింది. ఇలా… అన్ని పాత్రాల్లోనూ ఆయా కథలకు అనుగుణంగా నటించి మెప్పించిన బ్లాక్ అండ్ వైట్ బ్యూటీలకు కొదవ లేదన్నమాట.