సినిమాల్లోకి వచ్చిన తర్వాత..వ్యక్తుల జీవితం వేరేగా ఉంటుంది. ఇదో ప్రపంచం.. అప్పటి వరకు ఎన్నో పేర్లతో ఉన్నవారు.. కూడా.. ఆ సెంటిమెంటును పక్కన పెట్టి.. వెండితెర సెంటిమెంటుకు మొగ్గు చూపు తారు. ఇలా.. భక్త వత్సలం నాయుడు కాస్తా మోహన్‌బాబుగా మారిపోయారు. అలానే రాగిణి కాస్తా.. జయసు ధ అయింది. ఇలా… అనేక మంది పేర్లు మార్చుకున్నారు. చిరంజీవి పేరుకూడా అంతే కదా..!
తమ సొంత పేర్లతో నే సినిమా రంగంలో పేరుతెచ్చుకున్నవారు.. ఒక్క ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి కొందరు మాత్రమే. శోభన్‌బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. అయితే.. కొల్లి ప్రత్యగాత్మ అనే దర్శకుడు.. ఇంత పేరు బాగోదు.. బాబూ అన్నారట. ఓ సందర్భంలో. అయితే.. పేరు మార్చుకోండి సర్! అని శోభన్‌బాబు వెళ్లిపోయారు. అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఆయన పేరు ఉప్పు శోభనాచలపతిరావు అనే ఉండేది.
కానీ, ప్రత్యగాత్మ ఆతర్వాత.. ఆయన పేరును శోభన్‌బాబుగా మార్చారు. ఇలా.. అనేక మంది పేర్లు మారా యి. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్ల పేర్ల మార్పు విషయంలో అగ్రదర్శకుడు దాసరి నారాయణ రావు ముం దుండేవారు. పైగా.. ఆయన పేరు మారిస్తే.. తిరుగుండదనే సెంటిమెంటు కూడా ఉంది. ఇలా.. అనేక మంది తమ పేర్లు మార్చమని స్వయంగా దాసరిని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇలా..అడిగిన వారికి దాసరి ఎక్కువగాపెట్టిన పేర్లలో జయ – మోహన్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లతో నే ఆయన ఎక్కువ మందికి పేర్లు నిర్ణయించారు.. జయసుధ, జయప్రద, జయ మాలిని.. ఇవన్నీ.. దాసరి నారాయణరావు పెట్టిన పేర్లే. అదేవిధంగా.. మోహన్‌బాబు, బాబూ మోహన్.. పేర్లు కూడా దాసరి నారాయణ రావు పెట్టినవే. వీరికున్న సెంటిమెంటు.. ఆయన పెట్టిన పేర్లు.. వెరసి మొత్తంగా సినీ రంగంలో వీరు ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నారు.