తెలుగు వారి ఇలవేల్పు.. అన్నగారు ఎన్టీఆర్ అంటే.. ఒక ప్రత్యేకత.. ఒక గౌరవం.. ఒక మర్యాద అన్నీ ఉన్నా యి. అంతేకాదు.. ఒకానొక దశలో ఆయనంటే భయం కూడా ఉండేది. ఇక, ఓల్డ్ సినిమాల సమయంలో అ యితే.. అందరితోనూ కలిసి నటించిన పరిస్థితి కూడా ఉండేది. అయితే.. 1975 వరకు వచ్చిన సినిమాల్లో అన్నగారి స్టయిల్ ఒకరకంగా ఉండేది. డ్యూయెట్లలో కానీ.. రొమాన్స్ సీన్లలో కానీ. చాలా ఆచితూచి వ్యవహరించేవారు.
అయితే.. 1978-1990ల మధ్య మాత్రం.. అన్నగారి దూకుడు పెరిగింది. హీరోయిన్లను నలిపేస్తాడని.. పట్టు కుంటే వదిలి పెట్టడని కూడా పెద్ద ఎత్తున చర్చసాగేది. దీనిపై అనేక రూమర్లు కూడా వచ్చాయి. ఇక, సిని మా పత్రికలకు అయితే.. పండగే పండగ. వేటగాడు సినిమా నుంచి అనేక సినిమాల్లో జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లతో రొమాన్స్ సీన్లలో అన్నగారు జీవించేవారనే టాక్ నడిచేది.
ఇక, ఇలాంటివాటిపై సినీ క్రిటిక్స్, జర్నలిస్టులు రాసిన కథనాలను అన్నగారు చూసేవారు. ఆ వెంటనే వారికి ఫోన్ చేసి.. ఇది నాతప్పుకాదు.. సీన్ డిమాండ్ చేసింది. పైగా.. ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది! అనేవారట. కానీ, వాస్తవం ఏంటంటే.. అప్పటికే ఒక తరం దర్శకుల ప్రభావం తగ్గిపోయింది. రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావువంటి యువ దర్శకుల ప్రభావం పెరిగింది.
అదే సమయంలో యువత కోరికలు కూడా పెరిగాయి. సినిమాలపై యాక్సెప్టేషన్స్ మరింత పెరిగాయి. దీంతో కొన్ని కొన్ని రొమాన్స్ సీన్లలో హాట్ సీన్లు తప్పేవి కాదు. అవిలేకపోతే.. యూత్ నుంచి విజిల్స్ వచ్చేవి కాదని చెప్పుకొనేవారు. కానీ, క్రిటిక్స్ మాత్రం.. జయమాలినిని నలిపేసిన ఎన్టీఆర్ అని టైటిల్స్పెట్టి విమర్శలు గుప్పించేవారు. వీటికోసమేనా అన్నట్టుగా పాఠకులు సైతం ఎంతో ఇష్టంగా వాటిని చదువుకునేవారు.