ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు సినీ కెరీర్ అద్భుతం. ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టిన శోభన్‌బాబు తెలుగు సినిమా పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగారు. అయితే శోభన్‌బాబు – దివంగత హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంధంపై రకరకాల వార్తలు ఉండేవి. వీరిద్దరి మధ్య నిజంగానే ఎఫైర్ ఉందని.. వీరి బంధానికి గుర్తుగా ఓ కూతురు కూడా పుట్టిందని అంటారు. అలాగే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని చాలా మంది సినిమా వాళ్లు ఇప్పటకీ చెపుతూనే ఉంటారు.
ఇక శోభన్‌బాబు చెన్నైలో తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పుడు ఎలాంటి వివాదం లేకుండా అంత్యక్రియలు జరిపించేసి.. అంతా గప్‌చుప్ అయ్యేలా జయలలిత చేశారని కూడా ప్రచారం ఉంది. అసలు వీరిద్దరికి ముందుగా ఎక్కడ పరిచయం ఏర్పడింది ? శోభన్‌బాబును జయలలిత ఎందుకు ఇష్టపడిందన్న దానిపై ఆసక్తికరమైన కథే ఉంది. అప్పటికే జయలలిత స్టార్ హీరోయిన్. శోభన్‌బాబు కాస్త చామనచాయగా ఉండి.. సినిమాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక జయలలిత అంటే శోభన్‌బాబుకు అమితమైన ఇష్టం. ఓ సినిమాలో జయలలిత తన పక్కన హీరోయిన్‌గా ఉంటేనే సినిమా చేస్తానని కండీషన్ పెట్టాట్ట శోభన్‌బాబు. దర్శకనిర్మాతలు ఒప్పుకున్నారు. అయితే జయలలిత తల్లి మాత్రం స్టార్ హీరోయిన్గా ఉన్న తన కూతురు… ఓ ముక్కు మొఖం తెలియని హీరో పక్కన చేయడం ఏంటని వద్దన్నారట. అయితే జయలలిత మాత్రం ఈ విషయంలో ఫీల్ అయ్యిందట. నా పక్కన చేయాలని ఆశపడుతున్నాడు.. కొత్త కుర్రాడు.. మా అమ్మ ఇలా అడ్డు తగిలిందేంటని ఫీల్ అయ్యిందట.
ఈ సంఘటనే శోభన్‌బాబు పట్ల జయలలితలో కాస్త సానుభూతి పెరిగిందట. ఆ తర్వాత ఇద్దరు కలిసి సినిమాలు చేశారు. జయలలిత ముట్టుకుంటేనే మాసిపోయేలా ఉండేదట. శోభన్‌బాబు ఎత్తుగా ఉంటాడు. అయితే శోభన్‌బాబు భార్య మాత్రం నల్లగా ఉండేవారట. ఆమె చూడడానికి అంత బాగుండరని అందుకే శోభన్‌బాబు జయలలితపై ఆశపడ్డాడని అంటారు. ఈ విషయాన్ని రచయిత ఆరుద్ర భార్య కె. రామలక్ష్మి తన తాజా ఇంటర్వ్యూలోనూ స్వయంగా చెప్పారు.
శోభన్‌బాబు భార్య ఎవరో కాదు ఆయన గురువుగారి కుమార్తె. తన గురువు పెళ్లి చేసే పరిస్థితుల్లో లేడు. అందుకే ఆయన కుమార్తెనే తాను భార్యగా స్వీకరించానని శోభన్‌బాబు తనతో చెప్పారని రామలక్ష్మి చెప్పారు. శోభన్‌బాబు భార్య చూడడానికి అందంగా లేకపోయినా… ఆమెది మంచి మనస్సు అని.. ఇక జయలలిత అందం చూసే శోభన్‌బాబు ఆమెను ఇష్టపడ్డాడని రామలక్ష్మి ఓపెన్‌గా చెప్పారు.