బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వయసు ఐదున్నర పదులు దాటేసింది. ఇంత వయసు వచ్చిన సల్మాన్ ఖాన్ ఇంకా స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను మీ పెళ్ళెప్పుడు ? అని అడిగితే ఆ మాట మీరు సల్మాన్ ఖాన్ని అడగాలని సరదాగా జోక్ చేస్తూ ఉంటారు. సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు ? చేసుకుంటే ఆ వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ ఇంటర్వ్యూలలో చెబుతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రారంభం నుంచి చూస్తే ఎంతో మంది హీరోయిన్లు… ఎంతోమంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపాడు అన్నది వాస్తవం.
సల్మాన్ కెరీర్ ప్రారంభంలోనే మాధురి దీక్షిత్‌ను ఇష్టపడ్డాడు అని అంటారు. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్.. ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది. ఆ వెంటనే అమెరికా నుంచి వచ్చిన సోమీఆలీతో పిచ్చపిచ్చగా ప్రేమలో పడ్డాడు. నాలుగైదు సంవత్సరాలు వీరిద్దరూ చెట్టపట్టలేసుకొని తిరిగేసారు. సోమీ – సల్మాన్ పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న సమయంలో.. సల్మాన్ టార్చర్ తట్టుకోలేక సోమీ బ్రేకప్ చెప్పేసింది.
ఆ తర్వాత సల్మాన్ ప్రితీజింతాతోను క్లోజ్ గా ఉన్నాడు. అనంతరం ఐశ్వర్యరాయ్‌తో ఏకంగా ఏడు ఎనిమిది సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు. ఐశ్వర్య – సల్మాన్ పెళ్లి చేసుకోవడం ఒక్కటే మిగిలి ఉంది.. అనుకుంటున్న సమయంలో సల్మాన్ అపరిచిత రూపం చూసి ఐశ్వర్య దూరం అయింది. ఆ తర్వాత కూడా సల్మాన్ స్నేహ ఉల్లాల్, కత్రినా కైఫ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌తో పాటు ఒకరిద్దరు విదేశీ ప్రియురాళ్లతో కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడన్న పుకార్లు అయితే ఉన్నాయి.
అయితే సల్మాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇందుకు ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ పెళ్లి చేసుకోకపోవటానికి ఇదే కారణం అయి ఉంటుందా ? అనే సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్‌కు ఎరెక్టయిల్ డిస్ఫంక్షన్ అని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారికి అంగస్తంభన సరిగా జరగదు.. 40 – 60 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువుగా వస్తూ ఉంటాయట. సల్మాన్‌కు ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ అంటున్నారు. ఈ ప్రాబ్లమ్ ఉన్న వారు బయటకు చెప్పుకోలేక సతమతమవుతూ ఉంటారట.