Moviesనీహారిక-చైతన్యల పెళ్లిలో బిగ్ మిస్టేక్..? కూతురు విషయంలో నాగబాబు చేయకూడని తప్పు...

నీహారిక-చైతన్యల పెళ్లిలో బిగ్ మిస్టేక్..? కూతురు విషయంలో నాగబాబు చేయకూడని తప్పు చేసాడా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో మెగా డాటర్ నిహారిక డివోర్స్ న్యూస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ నిహారిక కొణిదెల డిసెంబర్ 9 న 2020 జొన్నలగడ్డ చైతన్యను గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది . కొన్నాళ్ల పాటు ఈ జంట తెగ ఎంజాయ్ చేసింది. ఎందుకో తెలియదు కానీ గత కొన్ని నెలల నుంచి దూరం దూరంగా ఉన్నారు ఈ జంట. ఇద్దరికి సంబంధించిన విషయాలను ఎవరు షేర్ చేసుకోవడం లేదు.

ఇద్దరు మీడియాకి కనిపించి చాలా కాలమే అవుతుంది. ఈ క్రమంలోనే మెగా డాటర్ సంసారంలో ఏదో చికాకులు ఉన్నాయి అంటూ వార్తలు వినిపించాయే తప్పిస్తే ఇలా నిజంగా విడాకులు తీసుకునే స్థాయికి వెళ్ళిపోతారు అని ఎవ్వరూ ఊహించలేదు . కాగా ఎవరు ఊహించిన విధంగా జొన్నలగడ్డ చైతన్య నిహారికతో పెళ్లి జరిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో డిలీట్ చేశాడు . అంతేకాదు నిహారిక అన్ ఫాలో చేశారు. ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది . విడాకులు తీసుకునే ముందు సోషల్ మీడియాలో సదరు వ్యక్తిని అన్ ఫాలో చేస్తూ వాళ్లకు సంబంధించిన జ్ఞాపకాలను డిలీట్ చేయడం.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ..స్టార్ హీరోయిన్ సమంత.. స్టార్ హీరో నాగ చైతన్యల మ్యాటర్ లో జరిగింది ఇదే. ఈ క్రమంలోని నిహారిక కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ కన్ఫామ్ చేసేసుకున్నారు మెగా అభిమానులు . అయితే..ఇలాంటి క్రమంలోనే నీహారిక పెళ్లి లో జరిగిన బిగ్ మిస్టేక్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి పెద్దోల పెళ్లిల్లో ముహూర్తాలు తక్కువుగా ఫాలో అవుతారట. వాళ్ల ఫోటో షూట్స్ .. మెకప్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి పెట్టిన ముహూర్తం దాటిపోతుంది అనే టాక్ ఎప్పటినుంచీ వినిపిస్తుంది. కాగా, నీహారిక పెళ్లిలోను అదే జరిగిందట.

చిరంజీవి మంచి పురోహితుడు దగ్గర చక్కటి ముహూర్తం పెట్టిస్తే.. అక్కడ ఫోటో షూట్స్.. మిగతా హంగామాలు అన్ని అయిపోయే సరికి పెట్టిన మంచి ముహుర్తం టైం దాటి పోయిందట. ఈ క్రమంలోనే తాళ్లి అరగంట లేటు గా మెడలో కట్టారట. అలా నాగ బాబు తెలిసి తెలియక చేసిన చిన్న తప్పే.. ఇప్పుడు కూతురు జీవితాని నాశనం చేసింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్లకి మెగా ఫ్యాన్స్ కూడా ఇచ్చి పడేస్తున్నారు. ఏ తండ్రి తన కూతురు జీవితం ఇలా మారాలి అని కోరుకోడు కదా..? అంటూ ఘాటు గా కౌంటర్ లు ఇస్తున్నారు. చూడాలి మరి దీని పై నాగ బాబు ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news