ప్రజెంట్ ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్ధార్ధ్ .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అదితి రావ్ హైదరి.. డేటింగ్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . గతంలో సిద్ధు ఖాతాలో ఎంతో మంది స్టార్ బ్యూటీస్ ఆయన ప్రేమ వలలో పడిన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పబోతోంది అంటూ జనాలు అనుకుంటున్నారు . అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో అదితి కి సిద్ధు గురించి ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోని అదితి కొంచెం ఘాటుగా స్పందించింది . “నేను ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నాను.. ఎక్కడికి వెళ్తున్నాను ..అనేదానిపై కాకుండా.. ఆ సినిమాల గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది.. నాకు మంచి సినిమాల్లో నటించడం ఇష్టం.. అలాంటి సినిమాల పైనే దృష్టి సారిస్తున్నాను .. ఆడియన్స్ నన్ను ఆదరిస్తే చాలు అనుకుంటున్నాను .. ఇలాంటి టైం లో వేరే ప్రశ్నలు వేసి టైం వేస్ట్ చేయకండి” అంటూ ఘాటుగా స్పందించింది .
దీంతో జనాలు షాక్ అవుతున్నారు. ప్రొదున్న లేచిన మొదలు..చేతిలో చెయ్యి పట్టుకుని తిరిగే నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటున్నారు. వీళ్ళు పలు ఈవెంట్స్ కు జంటగా హాజరవుతున్నారు.. అయినా కానీ సిద్దు పై ఇలా స్పందించడం కరెక్ట్ కాదు.. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా ..? అసలు సిద్ధార్ధ్ తో ప్రేమలో ఉందా ..లేకపోతే టైంపాస్ చేస్తుందా..? అంటూ జనాలు కామెంట్స్ చూస్తున్నారు.