Moviesహ‌మ్మ‌య్యా... అంజ‌లి పెళ్లి కుదిరింది.. వ‌రుడు ఎవ‌రు... ముహూర్తం ఎప్పుడంటే...!

హ‌మ్మ‌య్యా… అంజ‌లి పెళ్లి కుదిరింది.. వ‌రుడు ఎవ‌రు… ముహూర్తం ఎప్పుడంటే…!

తెలుగు అమ్మాయి అయినా తమిళంలో సక్సెస్ అయినంతగా అంజలి తెలుగులో సక్సెస్ కాలేదు. కొందరు స్టార్ హీరోల సినిమాలలో సెకండ్ లీడ్ కే పరిమితమైంది.. తప్ప స్టార్ హీరోయిన్‌గా ఫేమస్ కాలేదు. చూడ చక్కని అందం… మంచి అభినయం ముద్దుగా బొద్దుగా ఉండటం నటనలో తిరుగు లేకపోవడం అన్నీ ఉన్నా కూడా అంజలీని తెలుగు స్టార్ హీరోలు ఎందుకో పట్టించుకోలేదు. ఎక్స్పోజింగ్ విషయంలో కూడా తెలుగు అమ్మాయి అయి ఉండి కూడా మితిమీరింది.

అయినా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు.టాలీవుడ్ లో 10 ఏళ్లకు పైగా ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది తప్ప ఆమెకు ఇప్పటికీ సరైన బ్లాక్బస్టర్ హిట్ పడలేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం ఆమె మంచి ఛాన్సులు, మంచి హిట్లు, మంచి సినిమాలు చేసింది. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తర్కెక్కుతున్న సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది.

ఈ సినిమా హిట్ అయితే అంజలికి కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ వస్తుందటంలో సందేహం లేదు. ఇక గత‌ ఐదారేళ్ళుగా అంజలి ప్రేమ, పెళ్లి విషయంలో చాలా వార్తలు వచ్చాయి. ముందుగా ఆమె తమిళ నటుడు జైతో కలిసి లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది వారిద్దరూ మూడు నాలుగు ఏళ్ల పాటు పిచ్చపిచ్చగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. తర్వాత ఎక్కడ గ్యాప్ వచ్చిందో కానీ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇక ఇప్పుడు అంజలికి ఇంట్లో తల్లిదండ్రులు మంచి కుర్రాడని చూశారని… పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

అంజలికి ఒకప్పుడు కుటుంబంతో విభేదాలు ఉండేవని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అవన్నీ సమసి పోవడంతో అంజలి కుటుంబానికి బాగా దగ్గరయింది. ఈ క్రమంలోనే ఈ రాజోలు అమ్మాయి తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించి పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వరుడు కూడా తెలుగబ్బాయి అయినా చెన్నైలో ఉంటున్నట్టు తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేస్తున్న సినిమా తర్వాత అంజలి ఒక ఇంటిది అయ్యే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news