Lifestyleబాబోయ్ నీతా అంబానీ మేక‌ప్ ఆర్టిస్ట్ ఫీజు చూస్తే... టాప్ కంపెనీల...

బాబోయ్ నీతా అంబానీ మేక‌ప్ ఆర్టిస్ట్ ఫీజు చూస్తే… టాప్ కంపెనీల సీఈవోలు కూడా బేజారే…!

సంపన్న భారతీయుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఏం చేసినా సంచలనమే. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ 59 ఏళ్ళ వయసులోనూ 30 ఏళ్ల సినిమా హీరోయిన్లా అందంగా కనిపిస్తారు. చాలా స్టైలిష్ గా కనిపించే భారతీయ వ్యాపారవేత్తల్లో నీతా కూడా ఒకరు. అసలు మనవడని ఆడిస్తున్న ఈ వయసులో ఫ్యామిలీ వ్యాపార ఫంక్షన్లలో ఆమె చాలా చక్కగా ముస్తాబై కనిపిస్తూ ఉంటారు. అసలు నీతా ఈ వయసులో ఇంత అందంగా కనిపించడానికి కారణం ఏంటి ? ఆమె గ్లామర్ రహస్యం ఏంటి అన్నది చాలామందికి అంతు చిక్కదు.

అయితే నీతా అంబానీ అందం రహస్యం వెనక మిక్కీ కాంట్రాక్టర్ అనే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. అతడు నీతా అంబానీ కూతురు ఈషా అంబానీ, కోడలు శ్లోక అంబానికి కూడా మేకప్ సర్వీసు అందిస్తూ ఉంటాడు. మిక్కీ కాంట్రాక్టర్ ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. దీంతో అతడి ఛార్జ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ చార్జ్ ఎంతో వింటే చుక్క‌లు కనపడతాయి.

ఒక రోజుకు ఒక వ్యక్తికి మేకప్ చేస్తే ఏకంగా 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజు తీసుకుంటాడట. అందులోనూ ముంబైలో మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయి. అందుకే మిక్కీ కాంట్రాక్టర్ తో మేకప్ చేయించుకోవాలంటే సెలబ్రిటీలకు మాత్రమే సాధ్యం. ఈ స్థాయి భారీ చార్జీలు ఎవరు భరించలేరు ఈయన సంపాదన ముందు చాలా మంది సీఈవోలు కూడా సరిపోరు. మిక్కీ కాంట్రాక్ట‌ర్‌ దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి క‌భీ గ‌మ్‌, డాన్, గుడ్ న్యూస్, ఇంగ్లీష్ మీడియం వంటి సినిమాలకు పని చేశాడు.

మిక్కీ క్లైంట్లు జాబితాలో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఉన్నారు. కరీనాకపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మ వీళ్లంతా కూడా మిక్కీ మేకప్ చేయించుకుంటూ ఉంటారు. ఇక నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గా మిక్కీ కొనసాగుతున్నారు. మరి ఈ లెక్కన చార్జ్ వసూలు చేస్తుంటే దేశంలోనే పెద్ద పెద్ద కంపెనీల సీఈవోల జీతాలు సైతం మిక్కి కాంట్రాక్టర్ ముందు సరితూగవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news