టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి ఎంత పెద్ద గొప్ప డైరెక్టరో తెలిసిందే. బాహుబలి 1, బాహుబలి 2, త్రిబుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ఏకంగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. రాజమౌళి ప్రపంచం మెచ్చిన దర్శకుడు అయినా ఆయన విషయంలో హీరోలకు ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. రాజమౌళి 22 ఏళ్ల కెరీర్‌లో ఒక్క ప్లాప్ కూడా లేదు. అయితే రాజమౌళి ఏ హీరోతో అయినా సినిమా చేసి సూపర్ హిట్ ఇస్తే.. ఆ వెంటనే ఆ హీరో ఎంత పెద్ద డైరెక్టర్‌తో సినిమా తీసినా అది ఖచ్చితంగా అట్టర్ ప్లాప్ అవుతుంది.
ఎన్టీఆర్ మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్. ఆ వెంటనే సుబ్బు ఫ్లాప్ అయింది. మళ్ళీ అదే ఎన్టీఆర్ తో సింహాద్రి తీశాడు ఇండస్ట్రీ హిట్. తర్వాత ఆంధ్రావాలా పెద్ద ఫ్లాప్. యమదొంగ తర్వాత వచ్చిన కంత్రి కూడా ఫ్లాప్ అయింది. నితిన్‌కు సై తర్వాత అల్లరి బుల్లోడు – రవితేజకు విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్ పెద్ద ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ కు ఛత్రపతి తర్వాత పౌర్ణమి ఘోరంగా ప్లాప్ అయ్యింది.
అసలు అప్పటి వరకు ప్లాపులే లేని ఎంఎస్. రాజుకు పౌర్ణమి పెద్ద ప్లాప్. ప్రభాస్ తోనే బాహుబలి 1, 2 తర్వాత తీసిన సాహో కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సునీల్ కు మర్యాద రామన్న తర్వాత అసలు హిట్టు లేకుండా పోయింది. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు అగ్ర నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడు వేరువేరు సినిమాలలో నటిస్తున్నారు.
రామ్ చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మరి ఈ ఇద్దరు నటులు రాజమౌళి సినిమాతో హిట్ కొట్టిన వెంటనే మరో హిట్టు కొడతారా ? 22 ఏళ్లపాటు ఉన్న ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఇద్దరూ బ్రేక్ చేస్తారా లేదా ఎవరు ? బ్రేక్ చేస్తారన్నది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.