పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నారు. 28 సంవత్సరాల క్రితం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో కెరీర్ ప్రారంభించిన పవన్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వరుసగా సూపర్ హిట్లు కొడుతూ ఈరోజు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాతో పాటు సముద్రఖని దర్శకత్వంలో కోలీవుడ్ హిట్ సినిమా వినోదయ సితం సినిమా రీమేక్ – అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ – సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో కోలీవుడ్ హిట్ మూవీ తెరీ రీమేక్ ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్నాయి.
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, యంగ్ క్రేజీ హీరోలు అందరూ ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా ప్రాజెక్టులే చేస్తూ వస్తున్నాడు. అటు త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరు పాన్ ఇండియా ప్రాజెక్టులే ఓకే చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వాత బన్నీ కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాతో మహేష్ బాబు సైతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోనన్నాడు.
తన తోటి హీరోలు అందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తుంటే.. పవన్ మాత్రం ఇంకా టాలీవుడ్ ప్రాజెక్టుల మీదే కాన్సన్ట్రేషన్ చేయడం ఎంటా అని ? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంతోనే ఉన్నారు. అయితే 13 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ ఏకంగా పాన్ వరల్డ్ మూవీ కమిట్ అయ్యారు అనే విషయం చాలామందికి తెలియదు. సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా హాలీవుడ్ తో పాటు పలు ఇండియన్ భాషలలో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ సినిమాకు నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యాకప్ అరిస్ట్ క్రిస్టిన్ టిన్స్ లేని ఈ సినిమాకు టెక్నీషియన్‌గా ఎంపికయ్యారు.
ఎక్కువ మంది బాలలతో తెరకెక్కించే ఈ సినిమాలో పవన్ ఎలాంటి పాత్రలో నటిస్తారు ? అన్నది రివీల్ చేయలేదు. పవన్‌కు ఏసుక్రీస్తు గెటప్ వేసి కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. తర్వాత ఎందుకో ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు. పవన్ ఆ సినిమా చేసి ఉంటే పాన్ వరల్డ్ సినిమా చేసిన తొలి టాలీవుడ్ హీరో అయ్యి ఉండేవాడు.