Moviesరామ్‌చ‌ర‌ణ్ - బ‌న్నీ గొడ‌వ‌లు మ‌రింత ముదిరాయా… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా..!

రామ్‌చ‌ర‌ణ్ – బ‌న్నీ గొడ‌వ‌లు మ‌రింత ముదిరాయా… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు యంగ్ క్రేజీ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య కాస్త దూరం పెరిగింది అన్న ప్రచారం గత రెండేళ్ల నుంచి నడుస్తోంది. ఓవరాల్ గా సైరా సినిమా టైమ్ నుంచే అల్లు క్యాంప్, మెగా క్యాంపు మధ్య మాటలు లేవని.. ఏదో మనుషులు కలిసినా.. మనసులు కలవలేదు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.

ఇక సినిమాల విషయంలో కూడా బన్నీ – చరణ్‌ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. అసలు నందమూరి హీరో బాలకృష్ణ, మెగా హీరో చిరంజీవి సినిమాల మధ్య ఎలాంటి ? పోటీ ఉంటుంది.. ఈ ఇద్దరు హీరోల సినిమాల మధ్య రికార్డుల లెక్కలు ఎలా ఉంటాయో ? ఇప్పుడు మెగా అభిమానులు, బన్నీ అభిమానుల మధ్య అంతే స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఎవరు వెనుక్కు తగ్గటం లేదు. తమ హీరోయే గొప్ప అని ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక మెగా హీరోల సాధిస్తున్న రికార్డులు, ఘనతల విషయంలో కూడా అల్లు అర్జున్ చాలా మౌనంగా ఉంటున్నారు. ఇండస్ట్రీ అంతా విష్ చేశాకే మాత్రమే బన్నీ స్పందిస్తున్నట్టుగా ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా రికార్డుల విషయంలో చాలామంది స్పందించేంతవరకు బన్నీ స్పందించలేదు. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు జరిగితే బావమరిదికి విష్ చేస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

అలాగే చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ హీరోలు అందరికీ ఒక భారీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హాజరయ్యారు. దీనికి కూడా అల్లు అర్జున్ దూరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అల్లు, మెగా క్యాంపుల‌ మధ్య దూరం పెరిగింద‌నే వార్తలు వచ్చినట్లు అయింది.

ఇక ప‌వ‌న్ అభిమానుల విష‌యంలోనూ బ‌న్నీ త‌న యాట్యిట్యూడ్ చూపించ‌డం.. స్టైలీష్ స్టార్ అన్న ట్యాగ్ తీసేసి.. ఐకాన్ స్టార్‌గా ఎద‌గాల‌నుకోవ‌డం.. అస‌లు మెగా బ్రాండ్ అన్న ముద్ర లేకుండానే ముందుకు వెళ్లాల‌నుకోవ‌డం లాంటి విష‌యాలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీ క‌నీసం చర‌ణ్‌కు బ‌ర్త్ డే విషెస్ కూడా చెప్ప‌క‌పోవ‌డంతో ఈ రెండు క్యాంప్‌ల గ్యాప్ త‌గ్గ‌లేద‌నే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news