నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రీసెంట్గా తెరకెక్కిన వీరసింహారెడ్డి ఆయనకు కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ అయ్యింది. బాలయ్యకు ఒక బ్లాక్బస్టర్ సక్సెస్ రావడానికే చాలా టైం పట్టేది. అలాంటిది ఈ వయస్సులో వరుసగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు సూపర్ హిట్లు కొట్టేశాడు. వీరసింహారెడ్డి బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాలయ్య కెరీర్లోనే పెద్దది. వరల్డ్ వైడ్గా ఈ సినిమా రు.80 కోట్ల షేర్ టార్గెట్తో స్టార్ట్ అయ్యి ఆ బ్రేక్ ఈవెన్ దాటేసింది.
వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య తన నెక్ట్స్ సినిమా కూడా పట్టాలు ఎక్కించేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే తన 108వ సినిమాలో బాలయ్య నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఇప్పటికే ఆరు వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్ అనగానే చాలా కొత్తగా ఉంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాను ఈ యేడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు కూడా థమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక హీరోయిన్గా కాజల్ అగర్వాల్ పేరు కొద్ది రోజులుగా వినిపిస్తోంది.. రీసెంట్గా ఆమె పేరునే ఖరారు చేశారని చెపుతున్నారు. కాజల్ చివరగా మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆచార్య సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. అయితే కరోనా దెబ్బతో ఆ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం.. ఈ లోగా కాజల్ పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ సినిమా నుంచి ఆమె తప్పుకుంది.
ఇక ఇప్పుడు మళ్లీ బాలయ్య సినిమాతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో కాజల్ సెలక్షన్ పూర్తిగా దర్శకుడు అనిల్ రావిపూడిదే అట. బాలయ్య తన పాత్రకు తగ్గట్టుగా 50 ఏళ్ల వయస్సు పైబడిన పాత్రలో కనిపిస్తున్నాడు. పైగా శ్రీలీల బాలయ్య కూతురు పాత్ర చేస్తోంది. అందుకే బాలయ్యకు జోడీగా కాస్త ఏజ్ ఛాయలు కనిపించే కాజల్ అయితేనే సూట్ అవుతుందని ఆమెనే సెలక్ట్ చేశారు.