Moviesన‌మ‌త్ర శిరోద్క‌ర్ తండ్రి ఎవ‌రు... ఆ ఫ్యామిలీకి ఇంత ఎమోష‌న‌ల్ ఎందుకు....!

న‌మ‌త్ర శిరోద్క‌ర్ తండ్రి ఎవ‌రు… ఆ ఫ్యామిలీకి ఇంత ఎమోష‌న‌ల్ ఎందుకు….!

న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఆమె కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు. ముంబైలో చ‌దువుకునే రోజుల నుంచి మొద‌లైన ఆమె ప్ర‌స్థానం మిస్ ఇండియా వ‌ర‌కు వెళ్లింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాస్త‌వ్ సినిమా చేసింది. అనుకోకుండా తెలుగులో మ‌హేష్‌బాబుకు జోడీగా వంశీ సినిమా చేసింది. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయితే అదే ఆమె ప‌ర్స‌న‌ల్ కెరీర్‌ను మ‌లుపు తిప్పేసింది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే త‌న‌కంటే వ‌య‌స్సులో యేడాదికి పైగా పెద్ద వ‌య‌స్సున్న టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో ప్రేమలో ప‌డింది.

ఆ ప్రేమ చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు మారింది. ఇప్పుడు న‌మ్ర‌త‌, మ‌హేష్ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు గౌత‌మ్‌, సితార ఉన్నారు. ముంబైలో న‌మ్ర‌త ఫ్యామిలీకి చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆమె హీరోయిన్ అవ్వ‌డానికి ముందే ఆమె సోద‌రి శిల్పా శిరోద్క‌ర్ సినిమాల్లోకి వ‌చ్చింది. బాలీవుడ్‌లో ఆమె సినిమాలు చేసింది. ఆ టైంలోనే ఆమె మోహ‌న్‌బాబు హీరోగా బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్ర‌హ్మ సినిమాలో న‌టించింది.

ఆ సినిమా సూప‌ర్ హిట్ అయినా ఆ త‌ర్వాత శిల్పాకు తెలుగులో ఛాన్సులు రాలేదు. విచిత్రం ఏంటంటే అక్క‌కు ఛాన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు గోపాలే చెల్లి న‌మ్ర‌త‌కు కూడా వంశీ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక న‌మ్ర‌త‌, శిల్ప తండ్రి పేరు నితిన్ శిరోద్క‌ర్‌. త‌న కుమార్తెల కెరీర్ కోసం తండ్రి నితిన్ ఎంతో తాప‌త్ర‌య ప‌డేవాడ‌ట‌. నితిన్ ఈ లోకాన్ని వీడి వెళ్లి 16 సంవ‌త్స‌రాలు అవుతోంది. తండ్రి చ‌నిపోయిన జ్ఞాప‌కాల‌ను న‌మ్ర‌త నెమ‌ర‌వేసుకుంటోంది.

త‌మ తండ్రి త‌మ కెరీర్ కోసం ప‌డిన తాప‌త్ర‌యం, ఆయ‌న‌తో గ‌డిపిన జ్ఞాప‌కాలు గుర్తు చేసుకున్న న‌మ్ర‌త తాజాగా ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టింది. 16 ఏళ్లుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నాం ప‌ప్పా, నీ ప్ర‌తిజ్ఞాప‌కం నా మ‌దిలో అలాగే ఉండిపోయింది.. ఏమీ మార‌లేదు.. నువ్వు మ‌మ్మ‌ల‌ను చాలా త్వ‌ర‌గా వ‌దిలేసి వెళ్లిపోయావు… నీకు అనంత‌మైన ప్రేమ‌తో పాటు వెలుగులు ఎప్పుడూ పంపిస్తూనే ఉంటాను అని చాలా ఎమోష‌న‌ల్ పోస్టు న‌మ్ర‌త రాసుకువ‌చ్చింది.

ఇక న‌మ్ర‌త త‌న తండ్రి ఇమేజ్ కూడా షేర్ చేసింది. ఈ ఫొటో చూస్తుంటే న‌మ్ర‌త తండ్రి నితిన్ చాలా చిన్న వ‌య‌స్సులోనే మృతిచెందిన‌ట్టు తెలుస్తోంది. ఇక న‌మ్ర‌త పెళ్లి అయిన వెంట‌నే నితిన్ చ‌నిపోయార‌ట‌. అయితే ఇప్ప‌ట‌కీ తండ్రి ప్రేమ‌ను న‌మ్ర‌త త‌న గుండెల్లో అలాగే దాచుకుంది.

Latest news