సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం . రంగుల ప్రపంచం ..ఎప్పుడు ఎలా మారిపోతుందో ..ఎప్పుడు ఏం జరుగుతుందో .. ఎవరికీ తెలియదు. స్టార్స్ గా ఉన్న నటులు జీరో అవ్వడం .. జీరో గా ఉన్న నటులు స్టార్స్ అవడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటాయి . కేవలం స్టార్ హీరో హీరోయిన్స్ నే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయంలోనూ ఇలానే జరిగింది . అప్పటివరకు స్టార్ గా ఉన్న యాంకర్ గా పేరు సంపాదించుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ.. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంది. ఎంతలా అంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో సినిమాలో హీరోయిన్ ఉందా లేదా కాదు ..ఝాన్సీ ఆ సినిమాలో ఉంటే కచ్చితంగా హిట్ అవుతుందని ..కామెడీ కంటెంట్ ఉంటుందని..హోమ్లి లేడీస్ కూడా సినిమాను చూడొచ్చు అనుకునేవారు జనాలు .
అంతలా జనాల్లో తన పేరుని ముద్రించుకునేలా చేసుకున్న యాంకర్ ఝాన్సీ ..యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో కీలకపాత్రలో నటించి మెప్పించింది. స్టార్ కమెడియన్ సునీల్ తో కూడా కలిసి నటించిన ఈమె..మంచి మార్కులు వేయించుకుంది. భార్యాభర్తలుగా చేసిన ..లెక్చరర్ – స్టూడెంట్ గా చేసిన కామెడీ పరంగా చేసిన వీళ్ళిద్దరి కంటెంట్ జనాలను భళే ఆకట్టుకునింది . ఇప్పటికీ వీళ్ళకి సంబంధించిన ఫన్నీ సీన్స్ ను మనం యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటాం.
కాగా ఇదే క్రమంలో అప్పట్లో యాంకర్ ఝాన్సీ కి సునీల్ కి మధ్య సంబంధం ఉంది అంటూ పలు రూమర్లు వైరల్ అయ్యాయి. దానికి మెయిన్ రీజన్ పెళ్లయిన కొత్తల్లో సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించడమే కారణమంటూ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే అలాంటిది ఏమీ లేదని.. మేము మంచి ఫ్రెండ్స్ అంటూ ఎప్పటికప్పుడు ఆ వార్తలను క్లియర్ చేస్తూనే వచ్చింది ఝాన్సీ.. కాగా ఝాన్సీ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలిసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె డివర్స్ తీసుకుని లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది. కాగా ఝాన్సీ యాంకరింగ్ లోనే కాదు నటనలో కూడా కుమ్మేస్తుంది . ఎలాంటి రోల్స్నైనా అవలీలగా నటించగలిగే సత్తా ఉన్న నటి ఝాన్సీ . ప్రెసెంట్ వచ్చిన అవకాశాలతో సినిమా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తుంది ఝాన్సీ..!!