కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు.. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌తో కూడా ఏకంగా రు. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత విజయ్ నటిస్తోన్న సినిమా లియో.
విక్రమ్ సినిమాతో ఇండియాను ఊపేసిన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేశారు. 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి నటిస్తోన్న సినిమా ఇది. త్రిష విజయ్ పక్కన అనగానే తమిళనాట మాత్రమే కాదు… సౌత్ ఇండియా వైడ్‌గా ఈ ప్రాజెక్టుకు మంచి బజ్ వచ్చింది.
7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా, ప్రియా ఆనంద్ రెండో హీరోయిన్. నార్త్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా నుంచి త్రిష అర్ధాంతరంగా తప్పుకుందన్న వార్తలు ఒక్కటే కోలీవుడ్ మీడియాలో గుప్పుమంటున్నాయి. కశ్మీర్లో ప్రస్తుతం చలి ఎక్కువుగా ఉండడంతో యూనిట్ అక్కడ బాగా ఇబ్బంది పడుతోందట.
త్రిష సడెన్‌గా చెన్నైలో ప్రత్యక్షమైంది. చలి వల్లే ఆమె చెన్నైకు వచ్చిందని చాలా మంది అనుకున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్రిష ఈ సినిమా నుంచి పూర్తిగా తప్పుకుందని అంటున్నారు. త్రిష పాత్ర పరిధి చాలా తక్కువుగా ఉందని.. ప్రియా ఆనంద్‌కే మెయిన్ క్యారెక్టర్‌ను దర్శకుడు కనగరాజ్ ఇవ్వడంతో త్రిష అలిగి చెన్నై వచ్చేసిందని తెలుస్తోందని మరో ప్రచారం కూడా మొదలైంది.
కేవలం దర్శకుడు తనకు ముందుగా ఒకటి చెప్పి.. తర్వాత మరోలా చేయడంతోనే త్రిషకు కోపం వచ్చిందన్న పుకార్లు వచ్చాయి. అయితే ఈ వార్తలపై త్రిష తల్లి ఉమ స్పందించారు. లియో నుంచి త్రిష తప్పుకున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. అయితే ఆమె చెన్నై ఎందుకు వచ్చిందన్నది మాత్రం చెప్పలేదు. దీంతో లియోలో త్రిష ఉందా ? లేదా ? అన్నది సందేహంగానే ఉంది.