Moviesటాలీవుడ్‌లో విషాదం... డైరెక్ట‌ర్ సాగ‌ర్ మృతి.. ఎంత గొప్ప బ్యాక్‌గ్రౌండ్ అంటే..!

టాలీవుడ్‌లో విషాదం… డైరెక్ట‌ర్ సాగ‌ర్ మృతి.. ఎంత గొప్ప బ్యాక్‌గ్రౌండ్ అంటే..!

టాలీవుడ్‌లో వ‌రుస‌గా విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ ( విద్యాసాగ‌ర్ రెడ్డి) మృతిచెందారు. ఆయ‌న వ‌య‌స్సు 73 సంవ‌త్స‌రాలు. ఆయ‌న చెన్నైలోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. సాగ‌ర్ 40కు పైగా సినిమాల‌ను డైరెక్ట్ చేశారు. ఇక సాగ‌ర్‌కు చాలా గొప్ప బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆయ‌న పూర్తి పేరు విద్యాసాగ‌ర్‌. తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ డైరెక్ట‌ర్లుగా పేరున్న శ్రీను వైట్ల – వి. వి వినాయక్ – ఏఎస్‌? రవికుమార్ చౌదరి.. వీరంతా సాగర్ శిష్యులు కావ‌డం విశేషం.

వినాయక్ అయితే తాను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే దానికి కార‌ణం సాగ‌ర్ గారు అని ఎన్నోసార్లు గొప్ప‌గా చెప్పుకుంటారు. ఇక సాగ‌ర్ తెలుగు ఫిలిం అసోసియేషన్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాగ‌ర్ స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లా నిడ‌మ‌ర్రు. ఆయ‌న 1952లో మార్చి 1న జన్మించారు. సాగ‌ర్ వాళ్ల నాన్న నాగిరెడ్డి గ్రామంలో మునుసుబుగా ప‌ని చేస్తూ ఉండేవారు.

సాగ‌ర్‌కు చిన్న‌ప్ప‌టి నుంచే చ‌దువు అంటే ఆస‌క్తి ఉండేదే కాదు. ఆయ‌న ఎస్ ఎల్సీ వ‌ర‌కు చ‌దివారు. ఎడిటింగ్ మీద ఆస‌క్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత రాకాసి లోయ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇది 1983లో వ‌చ్చింది. న‌రేష్, విజ‌య‌శాంతి జంట‌గా న‌టించారు. ఆ త‌ర్వాత ఆయ‌న తీసిన స్టూవ‌ర్ట్‌పురం దొంగ‌లు సినిమా సూప‌ర్ హిట్ అయ్యి ఆయ‌న‌కు మంచి పేరు తీసుకువ‌చ్చింది.

ఇక‌ సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో 1995లో అమ్మ‌దొంగ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ తీశారు. 2002లో ర‌వితేజ‌తో అన్వేష‌ణ తీశాడు. ఇలా ఎన్నో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు టాలీవుడ్‌కు ముగ్గురు, న‌లుగురు సూప‌ర్ డైరెక్ట‌ర్ల‌ను అందించిన ఘ‌త‌న ఆయ‌న‌కే ద‌క్కుతుంది. సాగ‌ర్ మృతిప‌ట్ల సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news