MoviesNiharika "మెగా డాటర్ కు పోగరు ఎక్కువ".. టాలీవుడ్ హీరో డేరింగ్...

Niharika “మెగా డాటర్ కు పోగరు ఎక్కువ”.. టాలీవుడ్ హీరో డేరింగ్ కామెంట్స్ వైరల్..!!

మెగా డాటర్ నిహారిక ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా కుటుంబంలో నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నిహారిక ..కెరియర్ మొదట్లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది . అయితే మెగా ఫ్యాన్స్ ఆమెను హీరోయిన్గా చూడలేకపోయారు . ఈ క్రమంలోనే వరుసగా డిజాస్టర్లు అందుకున్నాయి . అయితే తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన పెళ్లిని చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది నిహారిక .

ప్రజెంట్ భర్త జొన్నల గడ్డ చైతన్యతో హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే సుమంత్ – నిహారిక కలిసి హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాను చేశారు . ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది . అయితే నటన పరంగా సుమంత్ మంచి మార్కులు వేయించుకున్నాడు .

ఈ సినిమా రిలీజ్ అయిన టైం లో నీహారిక ను జనాలు ఎక్కువుగా ట్రోల్ చేసేవారు. ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువని..ఓవర్ యాక్షన్ చేస్తూ..టెక్ చూపిస్తూ ఉంటుందని జనాలు ఎక్కువగా ట్రోల్ చేసేవారు . ఈ విషయంపై సుమంత్ ని ప్రశ్నించగా .. ఆయన వాటిని కొట్టి పడేసాడు.. నిహారిక చాలా మంచి అమ్మాయి అని.. షూటింగ్స్ కి కరెక్ట్ గా టైంకి వచ్చేస్తుందని ..మెగా ఆడపడుచులాగే అస్సలు ఉండదని.. చాలా జోవియల్ గా అందరితో కలిసి మెలిసి సరదాగా వర్క్ చేస్తుందని.. ఆమె షూట్ లో ఉంటే సెట్ అంతా అల్లరి అల్లరిగా చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు . ఆమె చాలా సింపుల్ గా ఈగో పొగరులేని అమ్మాయి అంటూ ఒక్క మాటలో తేల్చేసాడు . ఈ క్రమంలోని సుమంత్ – నిహారిక మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ ఉందా ..?అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news