జీవిత-రాజశేఖర్.. టాలీవుడ్లో హిట్ పెయిర్. అనేక చిత్రాల్లో కలిసి నటించారు. వీరు నటించిన సినిమాలు కుటుంబ కథా చిత్రాలుగా కూడా పేరు తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. ఇక, మన వాళ్లకు పెద్దగా తెలియని విషయం ఏంటంటే.. వీరిద్దరూ తమిళనాడుకు చెందినవారు. తెలుగు వారు మాత్రంకాదు. కానీ, జీవిత మాత్రం తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది
తెలుగులో వీరిద్దరూ నటించిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. కానీ, ఓ సందర్భంలో రాజశేఖర్ హీరోగా చేసిన ఓ సినిమాలో జీవితను హీరోయిన్గా తీసుకోవాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ దీనికి రాజశేఖర్ అంగీకరించలేదు. సినిమాలో హీరోయిన్‌ది బబ్లీగా, గ్లామరస్‌గా ఉండే పాత్ర అని, అలాంటి పాత్రలో హోమ్లీగా ఉండే జీవిత సరిపోదని నిర్మాతలకు రాజశేఖర్ సూచించారట.
దానికి దర్శక, నిర్మాతలు కూడా సరేనని చెప్పి రాజశేఖర్‌ను పంపించేశారట. 4 రోజుల్లో షూటింగ్ మొదలు కావల్సి ఉండగా.. రాజశేఖర్‌కు ఏ విషయం నిర్మాతలు చెప్పలేదు. అంటే.. హీరోయిన్ను మారుస్తున్నారో.. లేదో.. అసలు వేరేవారిని తీసుకుంటున్నారో .. లేదో కూడా చెప్పలేదు. దీంతో రాజశేఖర్లో కంగారు పెరిగి పోయింది. దీంతో తనే స్వయంగా నిర్మాతలకు ఫోన్ చేసి విజయం కనుక్కోవాలని అనుకున్నారు.
కానీ అవతలి నుంచి కనీసం ఫోన్ లిఫ్ట్ చేసిన పాపాన కూడా పోలేదు. చివరకు సినిమాలో తననే మార్చేశా రని, హీరోగా వేరేవారిని తీసుకున్నారని తెలిసి రాజశేఖర్ షాక్ తిన్నారట. అయితే ఆ తరువాత జీవిత, రాజ శేఖర్.. ఇద్దరూ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడం, ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడం.. చివరకు వారిద్దరు ప్రేమలో పడి భార్యభర్తలు అవ్వడం తెలిసిందే.