సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల జంట ముందు ఏ జంట పనికిరాదని చెప్పాలి. చాలా రొమాంటిక్ ..క్యూట్ అండ్ క్లాసిక్ జంట గా పేరు సంపాదించుకున్న బన్నీ – స్నేహాలు.. లవ్లీ పెయిర్ అంటూ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కూడాచెప్పుకొస్తూ ఉంటారు. అంతేకాదు బన్ని- స్నేహాల మధ్య చిన్న చిన్న ఫైటింగ్స్ అయినా సరే చాలా రొమాంటిక్గా బయటకు వచ్చినప్పుడు చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తూ ఉంటారు . అయితే బన్నీని స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .
స్నేహాని ఓ పబ్లో చూసిన బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ చూసి చూడంగానే నచ్చేసింది . బన్నీ మహాముదురు అందుకే ఎక్కడ అమ్మాయిని వేరే వాళ్ళు ఎగరేసుకొని పోతారా అంటూ వెంటనే ఐ లవ్ యు చెప్పేసాడు . ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి మాత్రం కొన్నాళ్లు టైం తీసుకుంది . అసలు బన్నీ క్యారెక్టర్ ఎలాంటిది..? బన్నీ సినిమాలో ఎలా ఉంటారు..? పైకి ఎలా ఉంటారు ..?అన్ని తెలుసుకొని మరి ఓకే చెప్పడానికి చాలా ఎంక్వయిరీ చేసింది . అలాంటి క్రమంలోని సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్య సినిమా రిలీజ్ అయింది .
ఇక అంతే ఒక్క దెబ్బతో బన్నీకి ఐ లవ్ యు టూ అని చెప్పేసింది. అంతలా సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు స్నేహాన్ని.. బన్నీ. మరీ ముఖ్యంగా ఫీల్ మై లవ్ సాంగ్ వచ్చినప్పుడు నిజంగానే బన్నీ – స్నేహ రెడ్డిని ఊహించుకొని పాట పాడాడ అనిపిస్తుంది . స్నేహ కు అలాగే అనిపించిందట . అందుకే ఈ ప్రేమికుడుని ఇక బాధ పెట్టకూడదు అంటూ భర్తగా లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఇదే విషయాన్ని బన్నీ తన ఇంట్లో చెప్పగా.. స్నేహ రెడ్డి వాళ్ళ ఇంట్లో చెప్పగా.. ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకొని కులాంతర వివాహం అయినా సరే చాలా గ్రాండ్ గా ఘనంగా జరిపించారు. అలా తనకు తెలియకుండానే బన్నీ స్నేహల మధ్య ప్రేమ పుట్టడానికి కారణం అయ్యాడు డైరెక్టర్ సుకుమార్ . కేవలం బన్నీ స్నేహల మధే కాదు ఎంతోమంది క్యూట్ కుర్రాళ్లలో.. అందమైన ముద్దుగుమ్మలలో ప్రేమ పుట్టడానికి కారణమయ్యాడు డైరెక్టర్ సుకుమార్ . అంతలా ఆర్య సినిమా అప్పట్లోనే జనాలను అట్రాక్ట్ చేసింది.