ప్రస్తుతం నందమూరి తారకరత్నకు మాసీవ్ స్ట్రోక్ రావడం… ఆయన బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతుండడంతో ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది. తారకరత్నతో పాటు ఆయన భార్య అలేఖ్యరెడ్డి, తారకరత్న కుమార్తె, ఆయనకు విజయసాయిరెడ్డి ఎలా బంధువు అవుతారు ? ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
వాస్తవానికి అలేఖ్యరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి స్వయానా తోడళ్లుడు కుమార్తె. ముందు అలేఖ్యకు మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడితో వివాహం జరిగింది. మనస్పర్థల నేపథ్యంలో వీరు విడిపోయారు. ఆ తర్వాత అలేఖ్య తనకు నచ్చిన ఫ్యాషన్ డిజైన్ రంగంలో స్థిరపడింది. తారకరత్న నందీశ్వరుడు సినిమా షూటింగ్ టైంలో ఆమె బిహేవియర్ నచ్చడంతో తారకరత్నే ముందుగా ఆమెకు ప్రపోజ్ చేశాడు.
ఆమె తన గతం గురించి చెప్పగా.. అప్పటికే తెలిసిన తారకరత్న నీ గతం నాకు అనవసరం.. నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పడంతో ఆమె కూడా ఓకే చెప్పింది. అయితే నందమూరి కుటుంబ సభ్యులు ఎవ్వరికి ఈ పెళ్లి ఇష్టం లేదు. చివరకు ఓ గుళ్లో చాలా సింపుల్‌గా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అలా ఇంట్లో వాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు కొన్నేళ్ల పాటు నందమూరి ఫ్యామిలీకి తారకరత్న దూరంగా ఉన్నాడు.
అయితే ఓ సారి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు నందమూరి ఫ్యామిలీతో పాటు తారకరత్న కూడా వచ్చాడు. అప్పుడు తారకరత్న, అలేఖ్య దంపతుల కుమార్తె రావడం.. ఆమెను బాలయ్య ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆడిచడం జరిగింది. ఆ పార్టీ ముగిశాక బాలయ్య నందమూరి ఫ్యామిలీ మెంబర్స్‌ను అందరిని దగ్గరకు పిలిచి.. అయిపోయిందేదో అయ్యింది.. వాళ్లు సంతోషంగా ఉన్నారు. ఇక మనం వారిని దూరం పెట్టడం సరికాదని చెప్పారట.
అలా బాలయ్య ఆ మాట చెప్పినప్పటి నుంచి తారకరత్న దంపతులను నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ పిలవడం, కలుపుకోవడం మొదలు పెట్టారు. అలా బాలయ్య ఒక్కమాటతో తమను నందమూరి ఫ్యామిలీలో కలిపేశారని అలేఖ్యకు ఆయనంటే ఎంతో అభిమానం ఉంటుంది. ఇక ఇప్పుడు తారకరత్నకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా బాలయ్యే స్వయంగా దగ్గరుండీ మరీ తారకతర్నకు వైద్యం జరుగుతోన్న తీరును పర్యవేక్షిస్తున్నారు.