Moviesగుంటూరులో మైత్రీ వాళ్ల కొత్త మ‌ల్టీఫ్లెక్స్‌... క‌ళ్లుచెదిరే స్పెషాలిటీస్ ఇవే..!

గుంటూరులో మైత్రీ వాళ్ల కొత్త మ‌ల్టీఫ్లెక్స్‌… క‌ళ్లుచెదిరే స్పెషాలిటీస్ ఇవే..!

మైత్రీ మూవీస్ మొత్తానికి క్ర‌మ‌క్ర‌మంగా టాలీవుడ్‌పై త‌న ప‌ట్టుబిగిస్తూ వ‌స్తోంది. ఆచితూచి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకుపోతోంది. అస‌లు గ‌త కొన్నేళ్లుగా కావ‌చ్చు.. ప్ర‌స్తుతం ఆ సంస్థ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే స్టార్ హీరోల‌కు వరుస‌గా అడ్వాన్స్‌లు ఇచ్చి.. వాళ్ల డేట్లు బ్లాక్ చేయ‌డం, అలాగే స్టార్ డైరెక్ట‌ర్ల‌ను కూడా త‌మ గుప్పెట్లో పెట్టుకోవ‌డం… ఇలా దిల్ రాజు లాంటి వాళ్ల‌కే షాకులు ఇచ్చింది.

ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రూ చేయ‌ని విధంగా ఒకేసారి ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాల‌ను త‌మ బ్యాన‌ర్లో తెర‌కెక్కించి రిలీజ్ చేయ‌డంతో పాటు రెండు సినిమాల‌తోనూ సూప‌ర్ హిట్లు కొట్టింది. అస‌లు ఈ రికార్డ్ ఎంత పెద్ద గొప్ప ప్రొడ్యుస‌ర్‌కు అయినా సాధ్యం కాక‌పోవ‌చ్చు. అంత గొప్ప డేరింగ్ స్టెప్ వేసింది మైత్రీ బ్యాన‌ర్‌.

ఇప్ప‌టికే నైజాంలో దిల్ రాజుకు పోటీగా ఓన్ డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ స్టార్ చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఇలా ఒక్కో వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తూ వ‌స్తోన్న మైత్రీ వాళ్లు ఇప్పుడు గుంటూరులో ఓ మ‌ల్టీఫ్లెక్స్‌ను టేకోవ‌ర్ చేసే ప్ర‌య‌త్నంలో చివ‌రి ద‌శలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. గుంటూరులో ఫీనిక్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన 5 స్క్రీన్‌ల మ‌ల్టీఫ్లెక్స్ అమ్మ‌కానికి వ‌చ్చేసింద‌ట‌.

ఈ మ‌ల్టీఫ్లెక్స్ గుంటూరు న‌గ‌రానికే త‌ల‌మానికంగా ఉంటుంది. దీనిని మైత్రీ వాళ్లు టేకోవ‌ర్ చేసే ప్రాసెస్ చివ‌రి ద‌శలో ఉన్న‌ట్టు తెలిసింది. ఓవ‌రాల్‌గా రు. 30 – 35 కోట్ల రేషియోలో డీల్ క్లోజ్ అవుతుంద‌ని టాక్ ? ఈ డీల్ క్లోజ్ అయితే మైత్రీ సంస్థ ఎగ్జిబిష‌న్ రంగంలోకి కూడా ఎంట‌ర్ అయిన‌ట్టు అవుతుంది. ఒక్క‌సారి ఎగ్జిబిష‌న్ సెక్టార్ట్‌లోకి కూడా ఎంట‌ర్ అయితే మెల్ల‌మెల్ల‌గా పాకుతూ ఉంటారు.

గుంటూరులో దిల్ రాజుకు ప‌ట్టులేక‌పోయినా యూవీ వాళ్ల‌కు అక్క‌డ మంచి నెట్‌వ‌ర్క్ ఉంది. ఇప్పుడు అక్క‌డ మైత్రీ వాళ్లు కూడా ఎంట‌ర్ అయితే యూవీ వాళ్ల‌కు కూడా ఎంతైనా చెక్ ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news