సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ స్టార్ సెలబ్రిటీ మరణించిన విషాద వార్త వినక ముందే .. మరో స్టార్ సెలబ్రిటీ మరణించారు అనే బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తుండడంతో ..సినీ జనాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు . రీసెంట్ గా మరో స్టార్ నటుడు హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు తెలుస్తుంది . కోలీవుడ్ స్టార్ నటుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభు అనారోగ్యానికి గురైనట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు తెలుస్తుంది . గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రభు ..మంగళవారం కాస్త ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారని ..ఈ క్రమంలోని ఆరోగ్యం క్షీణించి స్పృహ తప్పి పడిపోయారని ..కాలు కూడా కదలలేని పొజిషన్లో ఆయనను చూసిన కుటుంబ సభ్యులు దగ్గరలోనే హాస్పిటల్ కి తీసుకెళ్లారని.. ఈ క్రమంలోనే వైద్యులు అతనికి వెంటనే చికిత్స అందించి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మూత్రపిండంలో ఉన్న రాళ్లను తొలగించారని తెలుస్తుంది .
ప్రభు ఆరోగ్యం బాగానే ఉన్నా పరిస్థితి ఇంకా కంట్రోల్లోకి రాలేదంటూ కోలీవుడ్ మీడియా వార్తలు ఆధారంగా తెలుస్తుంది . ఈ క్రమంలోనే కొందరు ప్రభు ఆరోగ్యం మరింత క్షీణించిందని.. ఆ విషయం బయటకు చెప్పకుండా డాక్టర్స్ మభ్యపెడుతున్నారని అంటున్నారు . అయితే ప్రభు ఫ్యాన్స్ మాత్రం ఆరోగ్యం పై టెన్షన్ పడుతున్నారు ..ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు . ఈ క్రమంలోని కొందరు ఫాన్స్ కూడా ప్రభు ఆరోగ్యం ఎలా ఉంది..? అసలు ఏమైందన్న దాని పై టెన్షన్ పడుతున్నారు . అయితే మరో రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటూ ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . దీంతో ప్రభు అభిమానులు ఎటు తేల్చుకోలేని పొజిషన్లో ఉండిపోయారు..!!