Moviesచ‌రిత్ర‌లో నిలిచిన ఆ ఒక్క పాట కోసం నెల రోజులు ప్రాక్టీస్...

చ‌రిత్ర‌లో నిలిచిన ఆ ఒక్క పాట కోసం నెల రోజులు ప్రాక్టీస్ చేసిన ఎన్టీఆర్‌…!

క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌గారు ఎన్టీఆర్ చేసిన అనేక అజ‌రామ‌ర చిత్ర‌రాజాలు ఉ న్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో అనేక పుర‌ణా, ఐతిహాసిక‌చిత్రాలు తెలుగు తెర‌పై వెలుగు విర‌జిమ్మాయి. ఇలా వ‌చ్చిన సినిమానే పాండురంగ మ‌హ‌త్యం ఇది. అన్న‌గారి సొంత బేన‌ర్ ఎన్ ఏటీపై అన్న‌గారి సోద‌రుడు త్రివిక్ర‌మ‌రావు నిర్మించిన భారీ బ‌డ్జెట్ సినిమా(అప్ప‌ట్లో). నిజానికి సినిమా షూటింగ్ అంతా కూడా స్టూడియోలోనే సాగుతుంది.

అయిన‌ప్ప‌టికీ భారీ సెట్టింగుల‌కు భారీగానే ఖ‌ర్చు లు చేశార‌ట‌. ఇక‌, ఈ సినిమా మొత్తంలో హైలెట్ ఒకే ఒక్కటి. సినిమా చివ‌ర‌లో ఉన్న `హే కృష్ణా.. ముకుందా.. మురారీ“ అనే పాట‌. ఈ పాట ఇప్ప‌టికీ.. తెలుగు సినిమా రంగంలో హైలెట్‌గానే నిలిచింది. కేవ‌లం లిరిక్స్ మాత్ర‌మే కాదు.. సంగీతం.. నాట్యం.. ద‌ర్శ‌క త్వం.. లైటింగ్‌.. ఎడిటింగ్ ఏ విభాగం తీసుకున్నా..ఈ పాట‌కు కొట్టింది. ఈ సినిమా జాతీయ పుర‌స్కారాల పోటీకి వెళ్తే.. ఈ ఒక్క‌పాట‌కు మాత్ర‌మే పుర‌స్కారం ల‌భించింది.

ఇక్క‌డ ఇంకో చిత్రం ఉంది.. త‌ర్వాత‌..వ‌చ్చిన సినిమాల్లో ఈ త‌ర‌హా పాట‌లు పెట్టాల‌ని ద‌ర్శ‌కులు.. నిర్మాత‌లు కూడా పోటీ ప‌డ్డారు. కానీ, ఏ ఒక్క‌రూ ఈ రేంజ్‌లో పోటీ ప‌డ‌లేక పోయారు. విజ‌య‌చంద‌ర్ తీసిన‌.. క‌రుణామ‌యుడు చిత్రంలో కూడా ఈ త‌ర‌హా పాట‌ను పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అదే..క‌ద‌లింది క‌రుణ ర‌థం అనే పాట‌. ఈ పాట వింటే మ‌న‌కు హేకృష్ణా పాట త‌ర‌హాలోనే ముందుకు సాగుతుంది. అయినా.. ఆ రేంజ్‌లో అందుకోలేద‌ని సినీ ప్రియులు చెబుతుంటారు.

ఇక‌, హేకృష్ణా పాట మొత్తం అంతా కూడా స్టూడియోల్లోనే చిత్రీక‌రించారు. కానీ, అన్న‌గారు దీని కోసం నెల రోజులు ప్రాక్టీస్ చేశార‌ట‌. ఇక్క‌డ కీల‌క మై న విష‌యం ఏంటంటే.. అన్న‌గారు.. ఎక్క‌డా డ్యాన్సులు చేయ‌రు. కేవ‌లం హావ భావాల‌తోనే ఈ పాట న‌డుస్తుంది. మ‌రి నెల రోజులు ఎందుకు ప్రాక్టీస్ చేశారంటే.. ద‌ర్శ‌కుడు కామేశ్వ‌ర‌రావు అనేందుకు అన్ని రోజులు ప‌ట్టింద‌ట‌. అంత మ‌న‌సు పెట్టి చేశారు కాబ‌ట్టే.. ఆ పాట మ‌రో 100 ఏళ్ల పాటు నిలిచిపోయేలా తీశారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news