భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూ వస్తోంది. అసలు ఆమె పాకిస్తాన్‌కు చెందిన స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచే ఈ వివాదాలు మరింత ముదురుతూ వస్తున్నాయి. ఓ బిడ్డకు జన్మనిచ్చాక కూడా పెళ్లయ్యి ఇన్నేళ్లు అవుతున్నా కూడా వీరిద్దరు ఎవరి దేశాల్లో వారు సింగిల్‌గా ఉంటూ ప్రొపెషనల్‌గా వారి కెరీర్ కొనసాగిస్తూ వస్తున్నారు.
పెళ్లయిన ఇన్నేళ్లలో షోయబ్, సోనియా ఇద్దరూ కలిసి కాపురం చేసిన రోజులు తక్కువే. ఏదో వెకేషన్‌కు వెళ్లినట్టుగా మాత్రమే సానియా పాకిస్తాన్‌కు వెళుతుంది. ఇక షోయబ్ పెళ్లయిన కొత్తలో మినహాయిస్తే ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది లేదు. గత రెండేళ్ల నుంచి వీరిద్దరు విడిపోతున్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటున్నాయి. ఈ వార్తలకు బ్రేక్ పడడం లేదు.
తాజాగా సానియా తన ఇన్స్ట్రా గ్రామ్‌లో పెట్టిన పోస్టుతో ఆమె షోయబ్ నుంచి విడిపోనుందా ? అన్న సందేహాలకు బలం చేకూర్చేలా ఉంది. సానియా గత నెలలో కెరీర్లోనే తన చివరి మ్యాచ్ ఆడారు. తన భాగస్వామి రోహన్ బోపన్నతో కలిసి ఆమె ఈ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ తర్వాత సానియా తన ఇన్‌స్టాలో తన ఫొటో షేర్ చేసి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇది విశ్వాసం కోల్పోయే సమయం కాదు.. విశ్వాసాన్ని పట్టుకునే సమయం.. అని రాసుకు వచ్చింది. ఈ పోస్ట్‌పై ఇప్పుడు చాలా చర్చలు నడుస్తున్నాయి. సానియాకు భర్త నుంచి సపోర్ట్ లేదని.. అందుకే ఆమె తన ఆవేదనను ఇలా రాసుకువచ్చిందని.. ఇక ఆమె మానసికంగా విడాకులకు సిద్ధమయ్యే ఈ తరహా కామెంట్లు చేస్తోందని… ఈ ఘాటు కౌంటర్ షోయబ్కే అని కూడా అంటున్నారు.