టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ఏడెనిమిది దశాబ్దాల చరిత్ర. ఈ వంశం నుంచి మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. త్వరలోనే మరికొందరు హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఈ తరం స్టార్ హీరోల్లోనే ఎవ్వరికి సాధ్యం కాని అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకున్నారు.
సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఉన్న హీరోల్లో మనం డ్యూయల్ రోల్ చేసిన హీరోలను ఎంతోమందిని చూశాం. ప్రభాస్ బాహుబలి సినిమాలో డ్యూయెల్ రోల్ చేశాడు. చాలా మంది రెండు పాత్రలతో నటించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరూ కూడా ఈ తరం హీరోల్లో ఏ హీరో చేయని విధంగా ఏకంగా మూడేసి పాత్రల్లో నటించారు.
జూనియర్ ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో నటించాడు. జై, లవ, కుశ పాత్రల్లో నటించి వీరవిహారమే చేసేశాడు. ఈ సినిమా కేవలం ఎన్టీఆర్ నట విశ్వరూపం వల్లే హిట్ అయ్యిందనడంలో డౌట్ లేదు. ఇక ఇదే నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఎన్నో సినిమాల్లో రెండు, మూడు, నాలుగు పాత్రల్లో నటించి మెప్పించాడు.
దానవీరశూర కర్ణ సినిమాలో ధుర్యోధనుడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా ఎన్టీఆర్ నటన అసామాన్యం. ఇక చాలా మంది హీరోలు ఎన్నో పాత్రల్లో నటించారు. దశావతారం సినిమాలో కమల్ ఏకంగా 10 పాత్రల్లో మెప్పించాడు. 1966లో వచ్చిన నవరాత్రి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ఏకంగా 9 పాత్రలు వేశాడు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి కూడా మూడు పాత్రల్లో నటించారు.
అయితే ఈ తరం హీరోల్లో మాత్రం ఎవ్వరూ ట్రిపుల్ రోల్స్ చేయలేదు. ఎన్టీఆర్ జైలవకుశ సినిమా, కళ్యాణ్‌రామ్ రెండు రోజుల్లో వస్తోన్న అమిగోస్ సినిమాలో త్రిబుల్ రోల్ చేశాడు. ఏదేమైనా నందమూరి హీరోల్లో ఆ ఒక్క కుటుంబం నుంచే ముగ్గురు హీరోలు మూడు పాత్రల్లో నటించి అరుదైన రికార్డ్ సెట్ చేశారు. ఈ రికార్డ్ ఏ టాలీవుడ్ హీరోలు కూడా బ్రేక్ చేయకపోవచ్చు. అది సాధ్యం కూడా కాదు..!