బీ.సరోజ. ఒకనాటి అందాల రాణి. కన్ను తిప్పుకోలేనంత అందం ఆమె సొంతం. అనేక సినిమాల్లో నటించి.. మెప్పించిన బ్లాక్ అండ్ వైట్ బ్యూటిఫుల్ హీరోయిన్. పైగా.. స్లాంగ్ సహా.. అభినయం.. ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇక, అంజలీదేవి గురించి అందరికీ తెలిసిందే. ఆమె కూడా అందానికి.. అభినయానికి మారు పేరు. పైగా నిర్మాత, దర్శకురాలు కూడా..! అయితే.. వీరిద్దరిమధ్య పోటీ వచ్చింది.
ఒక సినిమాలో నువ్వా-నేనా అన్నట్టుగా కలిసి నటించారు. అదే.. కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్‌లో వచ్చిన పాండురంగ మహత్యం. అన్నగారు ఇందులో పుండరీకుని పాత్రలో నటించారు. ఇక, ఈసినిమాలో సరోజ.. అంజలీదేవి.. కూడా కీలక రోల్స్ లో కనిపిస్తారు. ముందుగానే కామేశ్వరావు.. ఇది ఇద్దరికీ మంచి సినిమా అవుతుంది.. చెలరేగిపోండి..! అనే సందేశం కూడా ఇచ్చారు.
అయితే.. పాత్రల పరంగా చూసుకుంటే.. సరోజ వేశ్య పాత్రలో నటించారు. అంజలీదేవి ఫక్తు గృహిణిగా నటించారు. ఎన్టీఆర్ (పుండరీకుడు)ను వశపరుచుకుని..ఆయన కాపురం భగ్నం చేయడం.. సరోజ పాత్ర తీరు. ఇక, భర్త ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే.. కాపురాన్ని నిలబెట్టుకునే పాత్ర అంజలీదేవి. ఇద్దరూ కూడా బాగానే నటించారు. చిత్రం ఏంటంటే.. ఇద్దరిపైనా దర్శకుడు కామేశ్వరరావు డ్యూయెట్లు పెట్టారు.
దీంతో ఇదరికీ పోటీ మరింత పెరిగింది. కీలక పాత్రల్లో ఇద్దరూ పోటీ పడి నటించారు. అయితే..చిత్రం విడుదలైన తర్వాత.. గృహిణిగా నటించిన.. అంజలీదేవి పాత్రకంటే.. కూడా వేశ్యగా చేసిన బి. సరోజకు మంచి పేరు వచ్చింది. పైగా.. ఆమె.. తెలుగు సినిమా ఇండస్ట్రీ (అప్పట్లో మద్రాస్‌లో ఉండేది) నుంచి మెప్పు కూడా లభించింది. దీంతో వేశ్యలకు ఉన్న విలువ భార్యలకు లేదన్నమాట! అని అంజలీ దేవి పరోక్షంగా సరోజ క్యారెక్టర్‌ను ఎత్తిపొడుస్తూ చేసిన కామెంట్లు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.