దాదాపు కొన్నేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ రీసెంట్ గా వచ్చిన పఠాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. పఠాన్ సినిమా షారుక్ కు అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొనే హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఏకంగా ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్టడీగా కొనసాగుతోంది. ఇక షారుక్ పఠాన్ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నయనతార షారుక్‌కు జోడీగా నటిస్తోంది.
షారుక్ తన భార్య గౌరీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి ప్రేమ విషయంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. షారుక్ ఖాన్ ముస్లిం. గౌరీ హిందూ అమ్మాయి. వీళ్ళిద్దరికీ పరిచయం లేదు. అయితే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ ఒక పార్టీలో కలిశారు. అప్పటికి షారుక్ వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.. గౌరీ వయసు 14 సంవత్సరాలు. వీరిద్దరి పరిచయం 1984లో జరిగింది. అలా వారిద్దరి మధ్య కలిగిన ఇష్టం ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఏడు సంవత్సరాల పాటు వీరిద్దరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. 1991లో షారుక్ – గౌరీ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇక 34 ఏళ్ల క్రితం ప్రేమికుల రోజున షారుక్ తన భార్య గౌరీకి ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడట. ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అది ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్. గౌరీకి షారుక్ ఇచ్చిన తొలి బహుమతి అదేనట. ఆ గిఫ్ట్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది అని గౌరీ ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించింది.
బాలీవుడ్ లో ఆ జంట విడిపోయింది. ఈ జంట మధ్య పొరాపచ్చలు వచ్చాయి అని చాలామంది దంపతులపై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ షారుక్ – గౌరీ దంపతుల జీవితానికి సంబంధించి ఎప్పుడు ఇలాంటి వార్తలు రాలేదు. విచిత్రం ఏంటంటే మతాంతర వివాహం అయినా కూడా వీరిది ఎంతో అన్యోన్య దాంపత్యం. ఈ ప్రేమికుల రోజుకు అభిమానుల నుంచి ఎలాంటి గిఫ్ట్ కావాలని అనుకుంటున్నారు అని షారుఖ్‌ను ప్రశ్నిస్తే ఆల్రెడీ అభిమానులు తనకు పఠాన్ లాంటి సినిమాతో గొప్ప సక్సెస్.. గొప్ప వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చారని అంతకుమించి తాను ఏం కోరుకోనని చెప్పాడు.