తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది . ప్రముఖ దర్శకులు కళాతపస్వి కే. విశ్వనాథ్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు . కాగ సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఈ మధ్యకాలంలో ఎక్కువ విషాద వార్తలు వినిపిస్తూ ఉన్నాయి . చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ అభిమానులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.
ఇదే క్రమంలో రీసెంట్ గానే సూపర్ స్టార్ కృష్ణ , కృష్ణంరాజు మరణించడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది . కాగా ఇదే క్రమంలో లెజెండరీ డైరెక్టర్ మరణించడం సినిమా ఇండస్ట్రీలో మరో విషాదాన్ని నింపింది . గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కళాతపస్వి కే విశ్వనాథ్ గురువారం నాడు తుది శ్వాస విడిచి పెట్టారు / ఆయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది . పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
కాగా ఆయన పూర్తి పేరు కాశీనాధుని విశ్వనాథన్ . ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు . ఆయన వాహిని స్టూడియోస్ లో సౌండ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ని ప్రారంభించారు. ఇక తర్వాత దర్శకుడుగా మారి ఆత్మగౌరవం సినిమాను ఎక్కించారు. ఆ తర్వాత ఆయన తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డైరెక్షన్ వహించారు . “సిరిసిరిమువ్వ , శంకరాభరణం , సప్తపది , సాగర సంగమం , స్వాతిముత్యం , సిరివెన్నెల, శృతిలయలు, స్వయంకృషి , స్వర్ణకమలం, సూత్రధారులు ,స్వాతికిరణం” వంటి ఎన్నో క్లాసికల్ హిట్ మూవీస్ ప్రేక్షకులకు అందించారు . అలాంటి డైరెక్టర్ మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమే..!!