లయ అచ్చ తెలుగు అమ్మాయి. విజయవాడ నలంద కాలేజీలో చదివిన లయ తొట్టెంపూడి వేణు హీరోగా 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టడంతో పాటు నంది అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి తెలుగులో జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితోను నటించేసింది. మనోహరం – ప్రేమించు సినిమాలకు కూడా లయకు నంది అవార్డులు వచ్చాయి. సీనియర్ నటుడు బాలకృష్ణతోను విజయేంద్ర వర్మ సినిమాలో నటించింది.
దాదాపు 13 ఏళ్లపాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. కెరీర్ చివరలో మళయాళంలోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఆ తర్వాత ఒక ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన లయ.. చాలా రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఇప్పుడు 1980ల్లో ఒక వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్లు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. లయ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె టాలీవుడ్‌కు అంత త్వరగా ఎందుకు ? దూరమైందన్న ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చింది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనకు మంచి పెళ్లి సంబంధం రావటంతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని.. అయితే తన భర్త ఎప్పుడు సినిమాలు చేయవద్దని చెప్పలేదని లయ తెలిపింది. ఇప్పటికీ నా రీల్స్, ఫోటోలు అన్నీ మా ఆయనే తీస్తూ ఉంటాడు.. భర్త నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉన్నాయి. ఆయన లేకుండా తానేం చేయలేనని లయ తెలిపింది.
సినిమా రంగంలో కష్టపడి స్టార్ హీరోయిన్ అయ్యాక అన్ని వదిలేసుకుని వెళ్లిపోవడం అంటే చాలా కష్టంగా ఉంటుందని… తాను కుటుంబాన్ని సినిమాలను, బ్యాలెన్స్ చేసుకోగలను అని చెప్పింది. అయితే భర్త యూఎస్ లో ఉండడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని.. ఇండియా నుంచి తరచూ అమెరికాకు వెళ్లి రావటం కష్టం కావడంతోనే తాను సినిమాలకు దూరమయ్యాని చెప్పింది.
ఇక రీసెంట్గా లయ కుమార్తె ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. లయ పక్కన లయకు మించిన అందంతో అదే ఎత్తులో ఉన్న లయను చూస్తుంటే… కచ్చితంగా ఆమె సినిమాల్లోకి వస్తే తల్లిని మించిన స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి కుమార్తె విషయంలో లయ భార్యాభర్తల ఆలోచనలు ఎలా ? ఉన్నాయో చూడాలి.