అప్పటి తరం స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన క్లాసికల్ కల్ట్ హిట్స్ ను ఈ తరం హీరోలు రీమేక్ చేయాలని కలలు కనడం సహజమే. గుండమ్మకథ సినిమాను ఎన్టీఆర్, నాగచైతన్య కాంబినేషన్లో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమా రీమేక్ చేయడం చైతు, ఎన్టీఆర్ ఇద్దరికి ఇష్టమే. అయితే ఈ కథను ఈ తరం జనరేషన్ మెచ్చేలా తెరకెక్కించే సమర్థుడు అయిన డైరెక్టర్ కావడమే ఆలస్యం.
అలాగే ఎన్టీఆర్ నటించిన ఓ మేటి క్లాసికల్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా రీమేక్‌లో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే అందుకు కాలం కలిసి రావడం లేదు. ఆ సినిమా ఏదో కాదు రాముడు భీముడు. 1964లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి. రామానాయుడు ఈ సినిమాను నిర్మించారు. ఇది ఎన్టీఆర్‌కు కెరీర్ పరంగా ఫస్ట్ డ్యూయల్ రోల్ బ్లాక్ బస్టర్ హిట్.
అంటే ఈ సినిమా వచ్చి 58 సంవత్సరాలు అవుతోంది. ఈ సినిమా వచ్చిన ఆరు దశాబ్దాలకు దీనిని మళ్లీ నాటి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తో రీమేక్ చేసే ప్రయత్నం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో రీమేక్ చేయాలని రామానాయుడు జీవించి ఉన్నప్పుడే ట్రై చేశారు. ఆయన ఎన్టీఆర్‌ను పిలిపించుకుని.. ఈ సినిమా రీమేక్ గురించి చెప్పడం.. ఎన్టీఆర్ వెంటనే ఓకే చేయడం జరిగిపోయాయి.
అయితే మంచి డైరెక్టర్ కోసమే జూనియర్, ఇటు రామానాయుడు వెయిట్ చేశారు. ఈ లోగా ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్స్‌కు తోడు.. రామానాయుడు మృతి చెందడంతో ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యింది. అయితే ఈ సినిమా రీమేక్ చేస్తానని రామానాయుడు, సురేష్‌బాబుకు ఎన్టీఆర్ మాట ఇచ్చి ఉన్నాడు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది ? ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేస్తే ఈ తరం జనరేషన్‌కు కనెక్ట్ చేసేలా హిట్ ఇవ్వడం ఏ దర్శకుడి వల్ల అవుతుందన్నదే కాస్త సస్పెన్స్.