జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ..ఈ షో నుండి తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి కొత్త యాంకర్ సౌమ్య వచ్చిన విషయం తెలిసిందే . కొన్నాళ్లుగా జబర్దస్త్ షో కు రెండు కళ్ళు లా ఏలేసిన యాంకర్ రష్మీ – యాంకర్ అనసూయ అంటే జనాలకు అదో మార్క్ ఇమేజ్ పడిపోయింది . ఆ ప్లేస్లో వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు . ఈ క్రమంలోని అనసూయ షో నుంచి తప్పుకోవడంతో సౌమ్య ప్లేస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ ప్లేస్ అనసూయ దే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
ఆమె లేకపోయినా ఆ ప్లేస్ ఆమెకే దక్కాలి అంటూ ఫ్యాన్స్ సౌమ్యను ప్రతి చిన్న విషయానికి టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే సౌమ్య జబర్దస్త్ యాంకరింగ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది .రకరకాల డ్రస్సులతో వెరైటీ వెరైటీ రీల్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది . కాగా రీసెంట్ గా సౌమ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది . ఈ వీడియోలో ఆమె ఓ పాటకు పలు విధాలుగా స్టెప్స్ వేస్తూ కనిపిస్తుంది .
అయితే ఆ డాన్స్ లో అమ్మడు డాన్స్ బాగా వేసినప్పటికీ కొందరు జనాలు తిట్టిపోస్తున్నారు . నీ మొఖానికి అది కూడా రాదా ..? డాన్స్ రాకుండానే జబర్దస్త్ యాంకర్ అయిపోయావా..? అంటూ ఫైర్ అవుతుంటే మరి కొంతమంది నీకు దండం పెడతాను తల్లి ఇంకోసారి ఇలా డాన్స్ చేసి మమ్మల్ని చంపకు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . ఈ క్రమంలోనే కావాలని ఎవరో సౌమ్యని టార్గెట్ చేస్తున్నారన్న విషయం సౌమ్య ఫ్యాన్స్ కి అర్థమైపోయింది . వారికి ఘాటుగా జవాబు ఇస్తున్నారు సౌమ్య ఫ్యాన్స్. ఈ క్రమంలోనే జబర్దస్త్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ సౌమ్య.. ఈ క్రమంలోనే ఈటీవీలో పలు సీరియల్స్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసింది. సౌమ్య ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా టర్న్ అయింది..!!