ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీల్లో పాత్రలు ధరించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సిల్క్‌స్మిత.. అనూహ్యంగా తర్వాత.. ఐటం సాంగ్‌లకే పరిమితం అయింది. అయితే.. సిల్క్‌స్మిత ఐటం సాంగ్ కోసం అనేక మంది క్యూకట్టేవారు.. అనే విష యం చాలా మందికి తెలియదు. అసలు సిల్క్‌స్మిత ఉంటే సినిమా సూపర్ హిట్.. అనేటాక్ కూడా వినిపించేది.
ఐటం సాంగ్‌లో సిల్క్ అందాలు చూసేందుకు యువత భారీ ఎత్తున థియేటర్లకు పోటెత్తేవారు. దీంతో నిర్మాతలు.. దర్శకులు కూడా 1980-90లలో సిల్క్ పాటను తప్పకుండా పెట్టేవారు. అయితే.. సిల్క్‌స్మిత పట్ల హీరో నటశేఖర కృష్ణ కూడా ఒక దశలో ఆశలు పెంచుకున్నారు. ఆయన చిత్రంలోనూ ఆమెతో ఒక పాటను ప్లాన్ చేశారు. దీనికి కూడా ఒక కారణం ఉంది.. 1980లలో కృష్ణ నటించిన సినిమాలు వరుసగా విఫలం అవడం సాగింది.
చిరంజీవి దూకుడుతో అప్పట్లో కృష్ణ కొంత వెనుకబడ్డారు. ఇక, ఏదో ఒక ప్రయోగం చేసైనా.. సినిమాను హిట్ బాట పట్టించాలని కృష్ణ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రౌడీ అన్నయ్య
సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో బాబూమోహన్ కూడా పనిచేశారు. కామెండీ అంతా కూడా బాబూ మోహన్‌పైనే చిత్రీకరించారు. అయితే.. సిల్క్‌స్మిత పాటను పెట్టాలని కృష్ణ నిర్ణయించారు.
అయితే.. ఎవరిమీద ఐటం సాంగ్ చేయాలనే సందేహం వచ్చింది. దీంతో దర్శకుడు భరద్వాజ్.. మాత్రం బాబూమోహన్‌పై చిత్రీకరిద్దామని.. సిల్క్ స్మిత మీ పక్కన చేస్తే.. బాగోదని సూచించారట. కానీ, అప్పటికే అనేక మంది తమిళ హీరోల సరసన చేసిన సిల్క్ అనేక హిట్లు ఇవ్వడంతో ఆమెతోనే తాను ఐటం సాంగ్ చేస్తానని భీష్మించారు. భరద్వాజ్ అయితే.. నేను చేయలేను.. అని చేతులు ఎత్తేయడంతో అప్పటి వరకు దర్శకత్వ బాధ్యతలు వహించిన భరద్వాజ్‌ను కృష్ణ పక్కన పెట్టేశారు.
ఈ క్రమంలోనే హీరో కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి పద్మాలయా స్టూడియోలో సెట్ వేయించారు. కృష్ణ, సిల్క్ స్మిత మీద పాట చిత్రీకరణ మొదలు పెట్టి.. సినిమాకు యాడ్ చేశారు. ‘వాకిట్లో రోకలి పెట్టా.. నట్టింట్లో తిరగలి పెట్టా’ అనే పల్లవితో సాగే ఈ పాట అప్పట్లో యువతను గిలిగింతలు పెట్టింది. ఈ పాట కోసం యువత భారీ ఎత్తున తరలి వచ్చారు. మొత్తానికి పట్టుబట్టి తీసిన సిల్క్ పాటతో కృష్ణకు ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇదీ.. సంగతి..!