ఈ టైటిల్ చూడటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నట్టు ఉంది. స్టార్ హీరోయిన్ వాణిశ్రీ ఏంటి ఓ స్టార్ విలన్‌ను తన బెడ్ రూమ్ కు తీసుకు వెళ్ళటం ఏంటని ? రకరకాల సందేహాలకు తావిచ్చేలా ఉంది. మ్యాటర్ లోకి వెళితే వాణిశ్రీ 1970 – 80వ దశంలో తెలుగులో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అప్పట్లో ఏఎన్నార్ – సూపర్ స్టార్ కృష్ణ – శోభన్ బాబు లాంటి నటులకు వాణిశ్రీ పర్ఫెక్ట్ జోడి. ముఖ్యంగా కళ్ళతో తన హవ భావాలను అద్భుతంగా ప్రదర్శించటంలో ఆమెకు ఆమె సాటి
వాణిశ్రీ కెరీర్ ప్రారంభంలోనే ఎత్తు పల్లాలను చూశారు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమె అలవాటు చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్లో అప్పట్లో స్టార్ విలన్‌గా ఉన్న రాజనాల షూటింగ్ లొకేషన్ కు వచ్చారట. ఇప్పట్లో హీరోలకు, హీరోయిన్లకు కేరోవ్యాన్‌లు ఉంటున్నాయి.. లేదా ప్రత్యేకంగా గుడిసెలు ఏర్పాటు చేస్తున్నారు. అప్పట్లో హీరోలు, హీరోయిన్లకు చిన్న చిన్న టెంట్లు మాత్రమే స్పెషల్ గా వేసేవారు. అలాగే ఎవరు కుర్చీ వాళ్ళు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకునే వారట.
ఒకరోజు రాజనాల షూటింగ్ కు వచ్చిన వెంటనే వాణిశ్రీ.. రాజనాల గారు కుర్చీ తెచ్చుకోవచ్చు కదా ? అని మామూలుగా అడిగారట. వెంటనే రాజనాల కాస్త అహంకార ధోరణితో నేను కుర్చీ తెచ్చుకునేదేంటి… నేను వస్తే ఎవరైనా లేచి నాకు కుర్చీ ఇవ్వాలి… లేకపోతే నిర్మాత నాకు కుర్చీ ఇస్తారు అని గర్వంగా చెప్పారట. నన్ను కుర్చీ ఇవ్వమంటారా ? అని అడిగితే నీకు సభ్యత సంస్కారం ఉంటే ఇవ్వమని ఆన్సర్ ఇచ్చారట. పక్కనే ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఘొళ్ళున నవ్వడంతో వాణిశ్రీ చిన్న బుచ్చుకున్నారట.
ఇక రాజనాల కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు అత్యంత దుర్భరమైన జీవితం గడిపారు. ఆయన తన వైద్యం కోసం.. తిండి కోసం చాలామందిని ఆదుకోమని వేడుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. ఒకరోజు ఆయన నేరుగా వాణిశ్రీ ఇంటికి వెళ్లారట. రాజనాలను చూసిన వాణిశ్రీ నేరుగా ఆయనను తన పర్సనల్ బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లిందట. ఆయన తన తప్పుకు క్షమాపణ కోరాలని ఎంత ప్రయత్నించినా వాణిశ్రీ అవే పట్టించుకోకుండా ఆయనకు సకల మర్యాదలు చేసి భోజనం పెట్టిందట.
ఆ తర్వాత తన డ్రైవర్‌తోనే.. తన కారులో రాజనాలను ఇంటిదగ్గర దిగబెట్టించిందట. ఇంటికి వెళ్ళాక ఆ డ్రైవర్ రాజనాలకు వాణిశ్రీ ఇచ్చిన కవర్ ఇచ్చారట. అందులో 25 వేల రూపాయలతో పాటు ఒక లెటర్ కూడా ఉందట. అందులో మీరు ఆ రోజు నన్ను అలా అన్నా కూడా ఎంతో గౌరవం ఉంది.. ఈ రోజు అంతే గౌరవం ఉందని రాసుకువచ్చిందట. దీంతో రాజనాల తాను కుర్చీ విషయంలో ఆమెతో ప్రవర్తించిన తీరుకు ఎంతో సిగ్గుపడిపోయాడట.