పెళ్లైనా.. తల్లైనా కూడా డిమాండ్ తగ్గేదేలే.. రేటు విషయంలో తాము చెప్పినంతా ఇవ్వాల్సిందే అని కొందరు స్టార్ హీరోయిన్లు పట్టుబడుతున్నారు. మాకంటూ ఓ రేంజ్, రేటు ఫిక్స్ అయ్యింది. ఆ రేంజ్‌కు ఒక్క రూపాయి తగ్గినా కూడా తాము ఎస్ చెప్పమనే అంటున్నారు ఆ హీరోయిన్లు. ఇప్పటికే వయస్సు పై బడింది. పెళ్లి చేసుకున్నారు.. కొందరు తల్లి కూడా అయ్యారు. అయినా కూడా హీరోయిన్‌గా చేయాలంటే తాము అడిగినంత సమర్పించేసు కోవాల్సిందే అంటున్నారు ఆ హీరోయిన్లు.
నయనతార – సమంత – కాజల్ అగర్వాల్ – హన్సిక – కీర్తి సురేష్ ఇలా వీళ్లంతా ఇప్పటికే ఫేడవుట్ అయిపోవాల్సిన వాళ్లు. కానీ మన తెలుగులో సీనియర్ హీరోలకు జోడీగా సరైన హీరోయిన్లు దొరక్కపోవడమే వీళ్లకు కలిసొస్తోంది. దీంతో వీళ్లు రెమ్యునరేషన్ విషయంలో కొండెక్కి కూర్చొంటున్నారు. నయనతారకు పెళ్లయ్యింది.. ఓ బిడ్డకు కూడా ఆమె జన్మనిచ్చింది. తనకంటే వయస్సులో యేడాది చిన్నోడు అయిన దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ఆమె పెళ్లాడింది.
పెళ్లికి ముందే ఆమె ఒక్కో సినిమాకు రు. 5 కోట్ల రేంజ్‌లో డిమాండ్ చేసేది. కానీ ఇప్పుడు రు. 6 – 7 కోట్లు అడుగుతోందట. బాలీవుడ్‌లో ఆమె షారుక్‌ఖాన్ పక్కన చేస్తోన్న జవాన్ సినిమాకు గాను ఆమెకు రు. 10 కోట్ల రెమ్యునరేషన్ ముట్టిందంటున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాకు క్రేజ్ పెరుగుతుండడం నయన్‌కు కలిసొస్తోంది. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా సమంత క్రేజ్ పెరిగింది.
ముఖ్యంగా అందాలు చూపించే విషయంలో సమంత ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇటు వెబ్‌సీరిస్‌ల్లోనూ హాట్‌గా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు సమంత ఒక్కో ప్రాజెక్ట్‌కు రు 4-5 కోట్లు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఇటు సినిమాలు, అటు వెబ్‌సీరిస్‌లు రెండు చేతులా సమంత సంపాదనకు కొదవేలేదు. విడాకుల ముందు వరకు సమంత తీసుకున్న రెమ్యునరేషన్ రు. 2-3 కోట్ల మధ్యలో ఉండేది. అది ఇప్పుడు దాదాపు అది రెట్టింపు అయిపోయింది.
ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని రీసెంట్‌గా ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. గర్భం దాల్చాక రెండేళ్ల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉంది. కాజల్ రేంజ్ తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు సీనియర్ హీరోలకు ఆమె ఆప్షన్‌గా ఉండడంతో రేటు విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్‌లో ఆమె డిమాండ్ మామూలుగా లేదట. ఒక్కో సినిమాకు రు. 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట.
పెళ్లికి ముందు ఆమె రేటు రు 1.5 కోట్లు ఇప్పుడు అది రెట్టింపు అయ్యింది.
ఆపిల్ బ్యూటీ హన్సిక కూడా ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైంది. ఆమె కూడా ఒక్కో సినిమాకు రు. 2 కోట్లు అడుగుతోందట. ఇక కీర్తి సురేష్‌కు అసలు ఛాన్సులే లేవు. అయినా కూడా ఆమె డేట్లు తీసుకోవాలంటే రు. 4 కోట్లు సమర్పించుకోవాల్సిందే అట. ఆమెకు కమర్షియల్‌గా అంత సక్సెస్ లేదు. అయినా కూడా ఆమె తన స్థాయిని మించి డిమాండ్ చేస్తోందంటున్నారు.