ఏంటో ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఏది ఎప్పుడు ఇష్టపడతారో ఎవరికి అర్థం కాకుండా పోతుంది . చూడడానికి చాలా చక్కగా ముద్దుగా క్యూట్ గా ఉన్న అందాల ముద్దుగుమ్మలు ఈడు జోడు చూడకుండా ఎవరిని పడితే వారిని ప్రేమ అంటూ నమ్మి మోసపోతున్నారు అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం . కాగా రీసెంట్గా సదా చేసిన పని సోషల్ మీడియాలో జనాలకు బిగ్ షాక్ ఇచ్చింది . ఎప్పుడు టాటూస్ అంటే ఇష్టం లేదు ఇష్టపడను అంటూ చెప్పుకునే సదా.. రీసెంట్గా ఆమె టాటూ వేయించుకుంది . ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకునింది.
దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో జనాలు షాక్ అయిపోయారు. జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సదా రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది . కాగా ఈ క్రమంలోనే పలు షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న సదా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . కదా రీసెంట్గా సదా టాటూ వేయించుకుంది . తనకి పిల్లి పిల్లలు అంటే చాలా ఇష్టం . ఈ క్రమంలోనే పిల్లి పాదాలను గుర్తుగా వేసుకుంటూ నాలుగు రెమ్మలను టాటూగా వేయించుకుంది.
ఈ క్రమంలోనే సదా పోస్ట్ చేస్తూ..” నాకు టాటూ అంటే అసలు ఇష్టం లేదు.. కానీ జీవితంలో కొన్ని కొన్ని సార్లు మనం ఇష్టం లేనివి కూడా ఇష్టపడే పొజిషన్ కి వస్తాం. ప్రెసెంట్ నేను అదే పొజిషన్ లో ఉన్నాను . ఈ టాటూ నాకు చాలా నచ్చింది అంటూ పోస్ట్ చేసింది . అంతేకాదు టాటూ వేయించుకున్న సదా .. సదాకు టాటూ వేసిన ఆమె ఇద్దరు శాఖాహారులు కావడం గమనార్హం. దీని పట్ల ఆమె ఎంత జంతు ప్రేమికురాలో మనం అర్థం చేసుకోవచ్చు.