Moviesపూరి జగన్నాథ్ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..? ఫైనల్లీ బుర్ర...

పూరి జగన్నాథ్ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..? ఫైనల్లీ బుర్ర ఉందని ప్రూవ్ చేసాడుగా..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్ . ఒకప్పుడు ఈయన సినిమాలు తీస్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు . భారీ ఫ్లెక్సీలతో భారీ భారీ కటౌట్లు.. నానాహంగామ చేస్తూ పాలాభిషేకాలు రచ్చ రంబోలా చేసే వాళ్ళు . అదే ఇప్పుడు ఈ సినిమా వస్తుందంటే కనీసం హిట్ కొడుతుందా లేదా అన్న భయం మొదలైంది .

కాకపోతే రీసెంట్గా భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన సినిమా డిజాస్టర్ గా మారింది . మరీ ముఖ్యంగా పూరి జగన్నాథ్ కి కాస్తో కూస్తో ఉన్న పరువును కూడా ఈ సినిమా తీసేసింది . ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ పూరి జగన్నాథ్ సినిమాలు తీయడానికి ఇష్టపడడం లేదు. దీంతో రీసెంట్గా పూరి జగన్నాథ్ చిన్న హీరోలతో సినిమా తీయడానికి సిద్ధపడ్డాడు . ఎప్పుడు స్టార్ సెలబ్రిటీస్ తోనే సినిమాలు తీసే పూరి జగన్నాథ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చే కొత్త హీరోలతో కూడా సినిమాలు తీయడానికి నిర్ణయించుకున్నారు.

నిజానికి స్టార్ హీరోసే కాదు ఈ మధ్యకాలంలో కొత్త హీరోస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు . విశ్వక్ సేన్ నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . డిజె టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ పాపులారిటీ సంపాదించుకున్నాడు .కాగా ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాధ తన రూటు మార్చి యంగ్ హీరోస్ పై కాన్సన్ట్రేషన్ చేయాలని చూస్తున్నాడట . ఈ క్రమంలోనే రీసెంట్గా మాస్ హీరోకి సినిమాకి కథ రాసుకున్నట్లు తెలుస్తుంది . దీంతో పూరి జగన్నాథ్ కి ఇప్పుడు బల్బ్ వెలగిందా అంటూ కొందరు ట్రోల్ల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news