సీనియర్ ఎన్టీఆర్ చాలామంది హీరోయిన్లతో చాలా సినిమాల్లో నటించారు. 1960 వ దకశంలో స్టార్ హీరోల నుంచి 1990వ దశకంలో హీరోయిన్ల వరకు ఎన్నో సినిమాలలో ఆడి పాడారు. దేవిక – కృష్ణకుమారి – వాణిశ్రీ – శారద – అంజలీదేవి – భానుమతి – జమున తరం హీరోయిన్ల నుంచి ఆ తర్వాత తరంలో వచ్చిన జయసుధ – జయప్రద – శ్రీదేవి ఇక 1990వ దశంలో మీనాక్షి శేషాద్రి – వాణీ విశ్వనాథ్ లాంటి హీరోయిన్ల పక్కన కూడా ఎన్టీఆర్ నటించారు. మూడు తరాలకు చెందిన హీరోయిన్లతో ఎన్టీఆర్ నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.
దాదాపు 40 సంవత్సరాలకు పైగా కెరీర్లో ఎన్టీఆర్ ఎంతోమంది హీరోయిన్లను చూసి ఉంటారు. ఎంతోమంది హీరోయిన్లు ఆయన పక్కన నటించాలని ఉబలాటపడి ఉంటారు. హీరోయిన్ల విషయంలో ఎన్టీఆర్ కాస్త మొరటుగా ఉండే వారిని ఒక ప్రచారం అయితే ఉండేది. ఏఎన్ఆర్ హీరోయిన్లను చాలా మృదువుగా పట్టుకునే వారని… అదే ఎన్టీఆర్ పాత్రలో లీనమైపోయి హీరోయిన్లను గట్టిగా హత్తుకోవడంతో పాటు వారితో కాస్త రఫ్‌గా వ్యవహరించే వారిని అంటూ ఉంటారు.
అయితే ఎన్టీఆర్ ఏ పాత్రలో లీనమైపోయిన జీవించేస్తారు. అది కృష్ణుడు కావచ్చు.. రాముడు కావచ్చు, వేటగాడు కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు… లేదా విశ్వామిత్రుడు కావచ్చు… అలాగే హీరోయిన్లతో సీన్లలో నటించేటప్పుడు కూడా పాత్రలో లీనమై వారిని గట్టిగా హత్తుకుంటారనే పేరు ఉందే తప్ప ఎప్పుడు ఏ హీరోయిన్ తోను అమర్యాదగా ప్రవర్తించింది లేదు. అయితే కొందరు హీరోయిన్లను ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారని కూడా అంటారు.
కెరియర్ ప్రారంభంలో దేవికను ఆయన ఎక్కువగా ప్రమోట్ చేసేవారు. ఆ తర్వాత కృష్ణకుమారిని కూడా ఇష్టపడ్డారని ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. కృష్ణకుమారిని అయితే తన సొంత బ్యానర్‌లో నిర్మించిన సినిమాలలో ఎక్కువగా హీరోయిన్గా తీసుకుని మరి ప్రమోట్ చేశారు. వీరితో పాటు వినయ విధేయలతో పాటు అణుకువగా ఉంటూ, ఇతరుల పట్ల గౌరవంగా ఉండే హీరోయిన్లను కూడా ఆయన ఎక్కువ గౌరవంగా చూసుకునేవారట.
తాను ఇష్టపడే, లేదా గౌరవించే హీరోయిన్లకు చాలా సీక్రెట్‌గా ఆయన ఇంటి నుంచి కొన్ని వెళ్లేయట. తన ఇంట్లో ప్రత్యేకంగా చేయించిన ఆవకాయతో పాటు గోంగూరు పచ్చడి, తన ఇంట్లో ఉన్న 12 గేదెల నుంచి తీసిన రుచికరమైన పాలు, నెయ్యి వెళ్లేవట. అలాగే సెల్వరాజ్ నుంచి ఎన్టీఆర్ కుటుంబం కొన్న 40 ఎకరాల్లో ప్రత్యేకంగా పండించిన కూరగాయలతో పాటు మామిడి పండ్లను కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేయించి మరీ ఎన్టీఆర్ తనకు నచ్చిన హీరోయిన్లకు పంపేవారట. అయితే ఈ విషయం ఎవ్వరికి తెలిసేదే కాదని.. కేవలం ఎన్టీఆర్ ఇంట్లో వాళ్లకు మాత్రమే తెలుసు అని చెపుతారు.