MoviesTaraka Ratna:తారకరత్న ను ఆ హీరోయిన్ కి ఇచ్చి పెళ్ళి చేయాలి...

Taraka Ratna:తారకరత్న ను ఆ హీరోయిన్ కి ఇచ్చి పెళ్ళి చేయాలి అనుకున్నారా..? కోట్ల ఆస్తికి అల్లుడు అయ్యే ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందంటే..?

నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న తారకరత్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే . 23 రోజుల పాటు సుదీర్ఘంగా మరణంతో పోరాడిన ఆయన ఇక అలసిపోయి తనువు చాలించాడు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి ని ఆపటం ఎవరి తరం కాలేదు . అంతలా ఆమె తారకరత్నపార్ధివ దేహం వద్ద ఏడ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి .

రీసెంట్ గా జరిగిన చిన్నకర్మ లో కూడా అలేఖ్య రెడ్డి గుక్క పట్టి ఏడ్చేసిన దృశ్యాలు జనాలను కదిలిస్తున్నాయి. కాగా తారకరత్న మరణించిన తర్వాత ఆయన తండ్రి తారకరత్న ఇంటికి రాకపోవడం .. మహాప్రస్థానంకు వచ్చి అంతక్రియ కార్యక్రమాలను పూర్తి చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. తారకరత్న తన తండ్రికి ఇష్టం లేని కులాంతర వివాహం చేసుకున్నాడు అన్న కారణంగానే నందమూరి ఫ్యామిలీ తారకరత్నను దూరం పెట్టింది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు నిజానికి మోహన్ కృష్ణ తారకరత్నను ఓ బడా స్టార్ కూతురికి ఇవ్వాలని అనుకున్నారట .

సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న టాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ రెండో కూతురికి తారకరత్న ని ఇచ్చి వివాహం చేయాలని మోహన్ కృష్ణ భావించారట. ఇంట్లోని పెద్దలు కూడా అదే అనుకున్నారట . అయితే ఈ క్రమంలోనే తారకరత్న తన ప్రేమ విషయాన్ని బయట పెట్టడం.. అది ఇంట్లో వాళ్లకి నచ్చకపోవడం ..ఆ తర్వాత తారకరత్న ఇల్లు వదిలి బయటకు వచ్చేసి.. ఆమెను పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టడం చకచకా జరిగిపోయాయి.

ఈ క్రమంలోనే కోట్ల ఆస్తి ఉన్న ఇంటికి స్టార్ అల్లుడుగా మారాల్సిన తారకరత్న ఇలా చిన్న వయసులోనే తిరిగి రానిలోకాలికి చేరుకుని తన జీవితాన్ని ముగించేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా తారకరత్న మన మధ్య లేడు అన్న విషయం జీర్ణించుకోవడం అంత సులభమైన విషయం కాదు . ఇప్పటికీ తారకరత్న ఫ్యాన్స్ ఆయన గురించి తలుచుకొని తలుచుకొని సోషల్ మీడియాలో బాధపడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news