టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చాలా ఫీట్ గా ఆరోగ్యవంతంగా ఉండే సమంత .. తన హెల్త్ గురించి ఎప్పుడు కేర్ తీసుకుంటూనే ఉంటుంది . అయితే ఎవరు ఊహించని విధంగా బాడీని ఫిట్గా ఉంచుకున్న సమంత.. ఇలా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురవ్వడం సినిమా ఇండస్ట్రీలో జనాలకు షాకింగ్ గా ఉంది. కాగా నిన్న మొన్నటి వరకు దక్షిణ కొరియాలో .. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకున్న సమంత .. రీసెంట్గా ఇండియాకు తిరిగి వచ్చింది.
అంతేకాదు ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తన మిగతా సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ లో పాల్గొంటుంది. కాగా రీసెంట్గా సమంత తన ఆరోగ్య పరిస్థితిపై ఓపెన్ గా చెప్పేసింది . మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చిన .. సమంత రీసెంట్ గా కొత్త ధెరపిని తీసుకుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని అభిమానులకు చెప్పుకొచ్చింది. మయోసైటిస్(ంయొసితిస్)కి సంబంధించిన నెలవారి ఐవీఐజీ(ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరఫీ) సెషన్‌కి హాజరైనట్టు తెలిపింది.
ఈ క్రమంలోనే రోజుకి నాలుగు గంటల పాటు కఠిన వ్యాయామాలు చేయాలని సమంత చెప్పుకొచ్చింది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రీట్ మెంట్ కోసం డబ్బుల కుమ్మరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సమంత తీసుకుంటున్న కొత్త ట్రీట్మెంట్ ఖర్చు రోజుకి 2 లక్షలకు పైగానే ఉంటుంది అంటూ తెలుస్తుంది . ఐవిఐజి ట్రీట్‌మెంట్ ఎంతో ఖరీదైనది..పది గ్రాముల సీసా ధర సుమారు రూ.20,000 ఉంటుంది. పాతిక కిలోల బరువున్న వారికి యాభై గ్రాముల ఐవిఐజి మెడిసిన్ అవసరం అవుతుంది. ఇందుకు రూ.1 లక్ష అవుతుంది. ఇక సమంత బరువు కనీసం 50 కిలోలనుకున్నా..రెండు లక్షలు ఖర్చవుతుంది. అంటే సమంత ఐవిఐజి ట్రీట్‌మెంట్ కోసం రోజుకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేస్తుందట. అంత ఖర్చు పెడితేనే సమంత ఇలా ఉంది..లేకపోతే ఇంకా డల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పుకొస్తున్నారు..!!