కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న శివరాత్రి రోజునే శివైక్యం చెందారు. 23 రోజుల పోరాటంలో తారకరత్న తిరిగి అజేయుడై వస్తాడని ఎంతో మంది ప్రార్థనలు చేశారు. అయితే వారి ఆశలు నెరవేరలేదు. తారకరత్న లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత రాత్రి నుంచే సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కడ చూసినా సంతాపాల వెల్లువ వ్యక్తం అవుతోంది.
అందరికి తారకరత్నగా మాత్రమే తెలిసినా తారకరత్నకు ఓ ముద్దుపేరు ఉంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. తారకరత్న అసలు పేరు ఓబులేసు. ఇంట్లో వాళ్లు అందరూ అయనను ముద్దుగా ఓబు అని పిలుస్తారు. భార్య అలేఖ్య కూడా ఓబు అని.. ఒక్కోసారి తారక్ అని పిలుస్తూ ఉంటుందట. ఇక గత నెల 27న బావ నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్న పాదయాత్ర ప్రారంభమైన తొలి రోజే కొద్ది సేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.
ముందుగా ఆ రోజు తారకరత్నకు కుప్పంలో వైద్యం చేశారు. స్థానిక వైద్యులు స్టంట్ కూడా వేశారని అన్నారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఆయన్ను గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి మరీ బెంగళూరులోని నారాయణా హృదయాలయాకు తరలించారు. అయితే బ్రెయిన్ , హార్ట్ సహకరించకపోవడంతో తారకరత్న 23 రోజులు మృత్యువుతో పోరాటం చేసి చనిపోయారు.