తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి మళ్ళీ అవకాశాలు రాక వాటి కోసం పడిగాపులుగాస్తున్న హీరోయిన్ దిశా పఠానీ. పూరి జగన్నాథ్ హీరోయిన్ అంటే ఎంత గ్లామర్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, సినిమా ఫ్లాపైనా కూడా ఆ హీరోయిన్‌కి పర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరు వస్తుంది. దాంతో ఎక్కువగా తెలుగు, హిందీ భాషలలో అవకాశాలు అందుకుంటుంటారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో దిశ మామూలుగా అందాలు ఆరబోయలేదు.
అయితే, పూరి కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీకి పరిచయం చేసిన రక్షిత, ఆసిన్, అనుష్క శెట్టి లాంటి వారు చాలా ఏళ్ళు హీరోయిన్స్‌గా కొనసాగారు. రేణు దేశాయ్, ఆయేషా టాకియా లాంటి వారు ఇతర కారణాల వల్ల మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఇక ఇజం, లోఫర్, రోగ్ లాంటి సినిమాలలో హీరోయిన్స్‌గా నటించిన వారు మాత్రం ఒకే ఒక్క సినిమాతో అడ్రస్ లేకుండా పోయారు.
అయితే, దిశా పటానీ తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ హిందీలో మంచి క్రేజ్ దక్కించుకుంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్రేజీ హీరోయిన్గా మారింది. ఒక దశలో అమ్మడిని తెలుగు సినిమాల కోసం అడిగితే, డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. అంత బిజీగా వరుస ప్రాజెక్ట్స్‌తో గడిపింది. కానీ, ఎందుకనో ఇప్పుడు అటు బాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి.
దాంతో ఇప్పుడు ఎక్కువగా కమర్షియల్ యాడ్స్‌లో ఫొటో షూట్స్‌లో కనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ అందాల ఆరబోతలో మాత్రం ఒక్కో మెట్టు పైకెక్కుతుందే తప్ప ఏమాత్రం స్కిన్ షో విషయంలో తగ్గడం లేదు. తాజాగా దిశా వదిలిన లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్‌లో ముందుకు వంగి ఎద అందాలను వెనక్కి తిరిగి ఆ భాగాన్ని చూపిస్తూ కవ్విస్తోంది. ఇవి చూస్తే ఎవరికైనా ఒక్కసారి ఒడిసిపట్టుకోవాలనిపిస్తుంది.