సినిమా రంగంలో తెరముందు కనపడేది ఒకటి.. తెరవెనక జరిగేది మరొకటి. చాలా మంది హీరోలు, దర్శకులు సెట్‌లోనే బూతులు తిడతారన్న పేరు ఉంది. నాటి తరం నుంచి నేటి తరం వరకు కొందరు హీరోలు, దర్శకులు కూడా సెట్లో బూతులు తిడతారన్న టాక్ ఉంది.. కొందరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కూడా హీరోయిన్లను బూతులు తిడుతూ ఉంటారట. ఆ తరంలో సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు హీరోయిన్లను సెట్లోనే బండ బూతులు తిట్టేవారట. అయితే అవి అర్థవంతంగాను… కాస్త సెటైరికల్‌గాను ఉండేవట. ఈ విషయంలో మాత్రం ఏఎన్నార్‌ది ఫస్ట్ ప్లేస్ అంటారు.
ఇక వాణిశ్రీ అయితే ఏఎన్నార్ బూతులను బాగా ఇష్టపడేవారట. పైగా హీరోయిన్లకు బూతులు మాట్లాడడం భలే సరదా అట. అర్థవంతమైన బూతులు.. ఆహ్లాదకరంగా.. మాట్లాడుతుండగా ఎక్కడో ఓ పిక్చర్ కనపడుతున్నట్టుగా ఉంటుందట. ఇక ఆ రోజుల్లో కొందరు స్టార్ డైరెక్టర్లు కూడా బూతులు మాట్లాడేవారట.
బీఏ సుబ్బారావు, పి. పుల్లయ్య ఎప్పుడూ బూతులు మాట్లాడుతూ హడావిడి చేసేవారట. వారు అనుకున్నట్టుగా షూటింగ్ జరగకపోతే వాళ్లు బూతులతోనే రెచ్చిపోయేవారట.
ఇక బూతుల దర్శకులు మాత్రమే కాకుండా బూతుల మేనేజర్లు ఉండేవారు. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ చలపతిరావు బూతులు… ఆయన్ను పిలిచి కావాలని బూతులు మాట్లాడించుకుంటారు. బూతులు తిట్టడంలో చలపతిరావు స్పెషల్. ఇక సీనియర్ హీరో మోహన్‌బాబు బూతులు ఎలా ఉంటాయో చాలాసార్లు చూశాం అని ఇండస్ట్రీ వాళ్లు అంటూ ఉంటారు.
షూటింగ్ స్పాట్‌లో ఎవడైనా తప్పు చేస్తే బాలయ్య కూడా కోపంలో ఏదో ఒక మాట తూలుతూ ఉంటారన్నది నిజం. ఇక ఈ తరం దర్శకులలో పూరి జగన్నాథ్, తేజ కూడా బూతులు తిడతారని అంటారు. పూరి ప్రస్టేషన్‌లో ఎవరిని అయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక మాట అని ఉండొచ్చు..! తేజ అయితే రెండు, మూడు సందర్భాల్లో నటన సరిగా రాకపోతే హీరోయిన్లను చెంపమీద పెట్టి కొట్టారని టాక్ వచ్చింది.
తేజ చేతిలో జయం హీరోయిన్ సదా, నువ్వు నేను హీరోయిన్ అనిత ఇద్దరూ కూడా దెబ్బలు తిన్నోళ్లే. ఇలా ఆ తరం నుంచి ఈ తరం వరకు సినిమా రంగంలో బూతులు తిట్టేవాళ్లు.. కోపం వస్తే చేయి చేసుకునే నటీనటులు, టెక్నీషియన్లు కొందరు కంటిన్యూ అవుతు ఉంటున్నారు.