Raveena Tandon రవీనా టాండన్ 1990వ దశకంలో బాలీవుడ్లో ఎంతో మంది కుర్రకారు కలల రాణి. తెలుగులోనూ ఆమె కొన్ని సినిమాలు చేసింది. బాలయ్య బంగారు బుల్లోడు, వినోద్‌కుమార్ రథసారథి, నాగార్జున ఆకాశవీథిలో సినిమాలు చేసింది. సౌత్‌లో ఉపేంద్రకు జోడీగా కూడా ఉపేంద్ర లాంటి సినిమాలు చేసింది. అప్పట్లో ఆమె అక్షయ్‌కుమార్‌తో నడిపిన ఎఫైర్ వ్యవహారం నేషనల్ మీడియాలో ఓ సెన్షేషనల్. రీసెంట్గా రవీనా తాను బాడీ షేమింగ్ విషయంలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానన్న విషయాన్ని బయట పెట్టింది.
ప్రధానంగా తన తొడల గురించే అందరూ చర్చించుకున్నారని.. తనను అందరూ థండర్ థైస్ అని పిలిచేవారని కూడా ఆమె వాపోయింది. తాను 16 ఏళ్లకే సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యానని.. ఆ టైంలో టీనేజ్‌లో ఉండడంతో కాస్త ఎక్కువ బరువుతో ఉండేదానిని అని.. అలా బరువుగా ఉండడంతో తన కాళ్లు, తొడలు లావుగా ఉండేవని.. అదే తనకు సినిమాల్లో అడ్వాంటేజ్‌గా మారిందని రవీనా చెప్పారు.
ఇక రీయల్ లైఫ్‌లో కూడా తాను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని.. చాలా మంది తనను థై క్వీన్ (తొడల రాణి) అని పిలిచేవారని రవీనా చెప్పింది. అలాగే బరువు తగ్గేందుకు తాను ప్రత్యేక ప్రయత్నాలు అయితే ఎప్పుడూ చేయలేదన్నారు. ఇక రవీనా అప్పట్లో సెక్సీ హీరోయిన్గా బాలీవుడ్లో రాణించారు. రవీనా షార్టు డ్రెస్సు వేసిందంటే చాలు కెవ్వు కేకే అన్నట్టుగా ఉండేది.
అసలు అప్పట్లో ఆమె వేసిన ఐటెం సాంగుల స్టెప్పులు ఇప్పటకీ మత్తెక్కించేలా ఉంటాయి. అక్షయ్‌కుమార్‌తో వేసిన మస్తు మస్తుకే సాంగ్ ఎలా పేలిందో … ఇండియాను ఎలా ఊపేసిందో చెప్పక్కర్లేదు. ఇక రవీనా వయస్సు ఇప్పుడు 48 ఏళ్లు. ఆమె ఫామ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ బాడీ షేమింగ్ గురించి మాట్లాడలేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె తనకు జరిగిన అవమానం బయట పెట్టింది.
ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీని పెళ్లాడిన రవీనా రీసెంట్గా కేజీయఫ్ 2 సినిమాలో రమ్మికా సేన్ పాత్రలో అదరగొట్టేసి గ్రాండ్‌గా సౌత్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రాధాన్యం ఉన్న పాత్రలు దొరికితే సౌత్ సినిమాలు చేసేందుకు ఆమె రెడీగా ఉంది.