సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు దర్శకులు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు అనేవి ఇప్పటి నుంచే కాదు.. గత ఆరేడు దశాబ్దాల నుంచే ఉన్నాయి. కెరీర్ ప్రారంభం నుంచే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చేవారు. అయినా ఇద్దరు.. ముగ్గురు హీరోయిన్ల విషయంలో ఆయనకు ఎఫైర్ ఉన్నట్టు అప్పట్లో మద్రాస్ పత్రికలు బాగా హైలెట్ చేశాయి. ఇప్పుడంటే అంత మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.. సోషల్ మీడియా యుగం నడుస్తోంది.
ఏ విషయం అయినా ఇట్టే బయటకు వచ్చేస్తుంది. చీమ చిటుక్కుమన్నా… దానిని చిలువలు పలువులు చేసి ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో మద్రాస్ కేంద్రంగా ఒకటి రెండు పత్రికలే ఈ ఎఫైర్ వార్తలను బాగా హైలైట్ చేస్తూ వచ్చేవి. అందులో కాగడా వీక్లీ పత్రికతో పాటు, తార సితార వీక్లీ పత్రిక ఈ తరహా వార్తలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ వార్తలను ఈ వీక్లీ పేపర్లు బాగా హైలెట్ చేసేవట.
చిరుకు రాధికకు మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడిచేదన్న టాక్ అప్పట్లో గట్టిగా వినిపించేది. చిరుకు పెళ్లయ్యాక కూడా రాధికతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యేవాడని అంటారు. వీరి క్లోజ్‌నెస్ చిరు భార్య సురేఖకు కూడా తెలుసనే అంటారు. రాధికతో కాకుండా ఖైదీలో నటించిన మరో హీరోయిన్ సుమలతకు చిరంజీవికి మధ్య కూడా లింక్ ఉందని కాగడాలో అప్పట్లో వచ్చిన వార్త సంచలనమే రేపిందట.
ఈ పత్రికను మద్రాస్ కేంద్రంగా కాగడా కామేశ్వరశర్మ ఈ తరహా వార్తలు రాసేవారు. సుమలత – చిరు ఎఫైర్ వార్తలతో చిరుకు సైతం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ వార్తలు ఎందుకు రాస్తారు.. పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారంటూ ఆయన ఓపెన్‌గానే మండిపడ్డారు. చిరు – రాధిక వార్తలు వచ్చినప్పటి కంటే సుమలతతో ఎఫైర్ వార్త వచ్చినప్పుడు పెద్ద గొడవే జరిగింది. కాగడా పత్రిక వాళ్లు క్షమాపణలు చెప్పాలని కూడా చిరు వైపు నుంచి డిమాండ్ వచ్చిందట.
చివరకు ఆ గొడవ ఏదోలా సర్దుమణిగింది. అప్పట్లో కాగడాలో కేవలం తెలుగు, తమిళ హీరోయిన్ల ఎఫైర్లు గురించి రాసేందుకే ఆయన 20 పేజీలతో ఓ వీక్లీ పత్రికను నడిపేవారు. చివరకు ఓ హీరో, హీరోయిన్ క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నా దానిని కూడా ఎఫైర్‌గా ఇందులో రాసేసేవారట.