Moviesఇద్ద‌రు హీరోల‌తో ప్రేమ‌క‌థ‌కు మ‌ర‌ణంతో ఎండ్ కార్డ్‌... చ‌రిత్ర‌లో నిలిచిన మ‌ధుబాల...

ఇద్ద‌రు హీరోల‌తో ప్రేమ‌క‌థ‌కు మ‌ర‌ణంతో ఎండ్ కార్డ్‌… చ‌రిత్ర‌లో నిలిచిన మ‌ధుబాల ప్రేమ‌కావ్యం..!

బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరో కిషోర్ కుమార్, అందాల సుందరి మధుబాల ప్రేమ కథ అత్యంత విషాదం అని చెప్పాలి. ఎన్నో ఆశయాలు… ఎన్నో కలలతో మొదలైన వారి ప్రేమ ప్రయాణం అత్యంత దుర్భ‌రంగా ముగిసింది. అసలు మధుబాల అంటే అప్పట్లో దివి నుంచి భువికేగిన దేవకన్యలా ఉండేది. ఢిల్లీలోని ఒక ముస్లిం కుటుంబంలో ఆమె జన్మించారు. మధుబాల అసలు పేరు ముంతాజ్ జహ‌న్ బేగం దేహల్వి.

ఆమె అందానికి ఆ తరంలో ఉన్న స్టార్ హీరోలు అందరూ ఫిదా అయిపోయారు. చాలామంది మధుబాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మధుబాల కూడా యవ్వన దశలో కొందరికి హీరోలతో సన్నిహితంగా మెలిగారని కూడా అంటారు. దిలీప్ కుమార్ తో ఆమె చాలాకాలం ప్రేమాయణం నడిపారు. అయితే వీరి ప్రేమ కథకు మధుబాల తండ్రి పెద్ద విలన్ అయ్యారు. దిలీప్ కుమార్ కి మధుబాల తండ్రికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి.

ఈ కారణంగానే మధుబాలను దిలీప్ దూరం పెట్టేశారు. పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచనలను కూడా ఆయన విరమించుకున్నారు. ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే మధుబాల తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. ఆమె గుండెలో హోల్స్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. అదే సమయంలో 1960లో కిషోర్ కుమార్ మధుబాలకు ప్రపోజ్ చేశాడు. వీరిద్ద‌రు క‌లిసి చల్తీకా నామ్ గాడీ, హాఫ్ టికెట్ సినిమాల్లో క‌లిసి న‌టించారు.

కిషోర్ ఫేమస్ గాయకుడిగా నటుడుగా వెలిగిపోతున్న రోజులవి. కిషోర్ చేసిన ప్రపోజల్‌ను మధుబాల ఓకే చేశారు. అదే యేడాది వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి కూడా మధుబాల తండ్రి ఒప్పుకోలేదు. అయినా మధుబాల.. కిషోర్ పెళ్లి చేసుకుని దంపతులయ్యారు. పెళ్లయ్యాక ఇద్దరు లండన్ వెళ్లారు. అక్కడే మధుబాల మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. డాక్టర్లు ఆమె గుండెలో హోల్ ఉం..ది సమస్య మరింత ఎక్కువైంది.. రెండు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం బ్రతకదని చెప్పారు.

కిషోర్ వెంటనే ఆమెను ఇండియాకు తీసుకొచ్చేశారు. మధుబాల ఇంట్లో మంచానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత కిషోర్ ఆమెను పట్టించుకోలేదు. ఆమెను చూసుకోవడానికి ఒక డ్రైవర్, పనిమనిషిని పెట్టి చేతులు దులిపేసుకున్నారు. అప్పటికి మధుబాల వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఆమె ఒంటరితనాన్ని భరించలేక తండ్రి వద్దకు వెళ్లిపోయారు. కిషోర్ కుమార్ నెలలో ఒకటి రెండు సార్లు కూడా మధుబాల దగ్గరకు వెళ్లేవాడు కాదు. కనీసం ఫోన్ కూడా మాట్లాడేవాడు కాదని అంటారు.

తనని చూస్తే మధుబాల ఎమోషనల్ అవుతుంది… ఏడుస్తుందని.. అది ఆమె గుండెకు మంచిది కాదని కిషోర్ సన్నిహితులతో చెప్పేవాడు. మరి వీరిద్దరి ప్రేమ మహిమో లేదా మధుబాల మనోధైర్య‌మో కానీ డాక్టర్లు చెప్పిన దానికంటే ఏడేళ్లు ఎక్కువకాలం ఆమె బ్రతికింది. 1969 లో ఆమె మృతి చెందింది. అంటే కిషోర్ కుమార్ తో పెళ్లి జరిగిన తొమ్మిది సంవత్సరాలకు ఆమె మృతి చెందింది. విచిత్రం ఏంటంటే వారిద్దరి పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే అనారోగ్యానికి గురై చాలా ఏళ్ల పాటు ఒంటరితనం అనుభవించింది.

ఇక మధుబాల బ్రతికి ఉన్నంతకాలం ఆమె మనసులో ట్రయాంగిల్ ప్రేమ కథ నడిచిందని అంటారు. దిలీప్ కుమార్ ని ఆమె పిచ్చిపిచ్చిగా ఆరాధించింది. అతడు దూరం పెట్టినందుకే కిషోర్ కుమార్‌ని వివాహం చేసుకోవాలని సడన్‌గా నిర్ణయం తీసుకుందని అంటారు. అనారోగ్యం వల్ల‌ కిషోర్ కుమార్ ఆమెతో సంతోషంగా గడిపింది లేదు. ఇలా ముగ్గురు స్టార్స్ మధ్య అప్పట్లో ఒక గొప్ప ప్రేమ కథ నడిచింది. ఈ ప్రేమకథ ఇప్పటికీ ఓ సంచలనంగా నిలిచిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news