ఆయని ఒకప్పటి మేటి నటీమణి. తెలుగులో శుభ సంకల్పం – శుభ లగ్నం – మావి చిగురు లాంటి ఎన్నో క్లాసిక్ సినిమాల్లో ఆమె నటించారు. ముఖ్యంగా కె. విశ్వనాథ్ లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత ఆమె సొంతం. అలాగే దశాబ్దాల కెరీర్‌లో ఆమె తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటులు అందరితోనూ కలిసి నటించారు. ముఖ్యంగా హోమ్లీ పాత్రలకు పెట్టింది పేరు అయిన ఆమనిని తెలుగు ప్రేక్షకులు బాగా లైక్ చేస్తారు.
ఆమని స్వస్థలం కన్నడం. ఆమె బెంగళూరులో పుట్టింది. దివంగత కన్నడ నటి సౌందర్యకు ఆమని మంచి స్నేహితురాలు. పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్‌లో మంచి అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు టీవీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది. సినిమాల కన్నా టీవీ కాన్సెఫ్ట్‌లు ఆమెకు మంచి పాపులారిటీ తీసుకు వస్తున్నాయి.
ఇక కెరీర్ ఆరంభంలో ఆమె సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేదట. అయితే ఎక్కడకు వెళ్లినా కూడా ఆమని వాళ్ల అమ్మను వెంటపెట్టుకుని మరీ వెళ్లేవారట. ఆమని వెంట ఎప్పుడూ ఆమె అమ్మ ఉండడం కొందరికి నచ్చేదే కాదట. దీంతో కొందరు దర్శక నిర్మాతలు మీ అమ్మను తీసుకురావొద్దు… ఒంటరిగా రమ్మని చెప్పేవారట.
వాళ్ల ఉద్దేశం అర్థం చేసుకున్న ఆమని.. వాళ్లకు చాలా ధీటుగా సమాధానం ఇచ్చేదట. అమ్మ లేకుండా నేను రాను అని ఖరాఖండీగానే చెప్పేదట. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇండస్ట్రీ అనేది ఎలా ? ఉంటుంది ? ఎవరి మనస్తత్వాలు ఎలా ? ఉంటాయో ఆమెకు తెలిసొచ్చిందట. అప్పటి నుంచి తాను చాలా జాగ్రత్తగా ఉండేదానిని అని ఆమని తెలిపింది.
ఇక కెరీర్ స్టార్టింగ్‌లో చెల్లి, కూతురు పాత్రలు ఎక్కువుగా వచ్చేయని.. ఒక సినిమాలో చెల్లిగా నటిస్తే.. ఇక ఎప్పుడూ అదే తరహా పాత్రలే వస్తాయని.. అందుకే హీరోయిన్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ చెల్లి, కూతురు పాత్రలు రిజెక్ట్ చేసేదానిని అని ఆమని చెప్పింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి చెల్లి పాత్ర వేయాలన్న ఆఫర్ కూడా ఆమనికి వచ్చింది. అయితే దానిని ఆమె రిజెక్ట్ చేసినట్టు తెలిపింది.