Moviesమ‌హేష్‌బాబు Vs ర‌వితేజ‌... టాలీవుడ్‌లో ఇదో కొత్త ర‌చ్చ మొద‌లైందా...!

మ‌హేష్‌బాబు Vs ర‌వితేజ‌… టాలీవుడ్‌లో ఇదో కొత్త ర‌చ్చ మొద‌లైందా…!

టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడు ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. సంక్రాంతి టైంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు – బన్నీ అలవైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. పెద్ద యుద్ధం జరిగింది. ఇక ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య – బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఇటు బాక్సాఫీస్ వేదికగా అటు సోష‌ల్‌ మీడియా వేదికగా మామూలు రచ్చ జరగలేదు.

ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన ఫైటే ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ అభిమానుల మ‌ధ్య జ‌ర‌గ‌బోతోందా ? అంటే అవున‌నే చెప్పాలి. మాస్ మహారాజా రవితేజ ఇటీవల త్రినాథ‌రావు నక్కిన దర్శకత్వంలో ధ‌మాకా సినిమాలో న‌టించి సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు. ఇది ర‌వితేజ‌కె కెరీర్ ప‌రంగా పెద్ద స‌క్సెస్‌. శ్రీ లీల హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా రు. 120 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ర‌వితేజ రెండు సినిమాలు చేస్తున్నాడు.

వీటిల్లో ఒక‌టి రావణాసుర, రెండోది భారీ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం గ‌జ‌దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కునుంది. ఈ సినిమాలో కృతిస‌న‌న్ సోద‌రి నుపూర్ స‌న‌న్ హీరోయిన్‌. ఈ సినిమాను ఆగ‌స్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా కూడా రిలీజ్ కానుంది.

ఈ సినిమాను ఆగ‌స్టు 11న వేస్తున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించేశారు మేక‌ర్స్‌. అదే రోజు ప‌క్కాగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ కూడా రిలీజ్ అయితే ఇద్ద‌రు హీరోల పోటీతో బాక్సాఫీస్ హీట్ అయితే మామూలుగా ఉండ‌ద‌నే చెప్పాలి. అస‌లే ఈ యేడాది పెద్ద హీరోల సినిమాలు లేవు. ఓ మోస్త‌రు అంచ‌నాలు ఉన్న ఈ రెండు సినిమాలు ఒకేరోజు వ‌స్తే అంద‌రికి న‌ష్ట‌మే. మ‌రి వీరిలో ఎవ‌రు వెన‌క్కు త‌గ్గుతారో ? వెయిట్ చేద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news